అవకాడో పండును ఎందుకు తింటారో తెలుసా.?
- October 12, 2023
అవకాడో.. ఈ పండును చాలా అరుదుగా మాత్రమే తింటారు. ఎందుకంటే ఇది చాలా ఎక్స్పెన్సివ్. పెరిగిన నాగరికతలో భాగంగా ఈ పండు గురించి చాలా మందికి తెలుస్తోంది. అయితే, ఏ పండు అయినా ఫుష్కలమైన ఆరోగ్య ప్రయోజనాలను అందించేదే.
అయితే అవకాడో పండుకు ఓ ప్రత్యేకత వుంది. ఈ పండును తరచూ తింటుంటే, తరగని యవ్వనం మీ సొంతమవుతుందని తాజా సర్వేలో తేలింది. బడా బడా మాల్స్, మార్కెట్స్‌లో ఈ పండు అందుబాటులో వుంటోంది.
మామూలుగా పండ్లలో వుండే విటమిన్లు, ప్రొటీన్లు.. ఫైబర్ కంటెంట్ ఈ పండులోనూ అధికంగా వుంటాయ్. దాంతో పాటూ, దీంట్లో మోనో అసంతృప్త కొవ్వు ఆమ్లాలు అధికంగా వుండడం వల్ల గుండె పోటు వచ్చే అవకాశాలు ఈ పండు తినే వారిలో చాలా చాలా తక్కువని చెబుతున్నారు.
ముఖ్యంగా అవకాడోలో యాంటీ ఏజింగ్ లక్షణాలు వుండడం వల్ల ఈ పండు తినేవారి చర్మం తాజాగా వుంటుంది. ముడతలు పడకుండా వుంటుంది. తద్వారా ఎక్కువ వయసున్న వారు సైతం తక్కువ వయసున్న వారిలా కనిపిస్తుంటారు. వయసు రీత్యా వచ్చే ఆర్ధరైటిస్ సమస్యలు కూడా దూరంగా వుంటాయ్. అందుకే వీలైతే అప్పుడప్పుడూ అయినా అవకాడో పండును తిన చూడండి.
తాజా వార్తలు
- TDP ప్రవేశపెట్టిన తీర్మానానికి వైసీపీ మద్దతు
- ప్రపంచంలో నాలుగో అతిపెద్ద అంతిమయాత్రగా రికార్డు
- శ్రీవారి సేవకులకు VIP బ్రేక్ దర్శనం
- భారీ ఆఫర్లతో ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్-2025
- ఘనంగా జాతీయ చలన చిత్ర అవార్డుల ప్రదానోత్సవం
- ఖతార్ లో ఫ్యామిలీ మెడిసిన్ సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ప్రారంభం..!!
- శాంతి కోసం ఒక్కటైన సౌదీ అరేబియా, ఫ్రాన్స్..!!
- ఆల్ టైమ్ హై.. Dh450 దాటిన గోల్డ్ ప్రైస్..!!
- కువైట్ లో 'జీరో' శ్వాసకోశ వ్యాధుల సీజన్..!!
- చరిత్రలో తొలిసారి.. ఒమానీ రియాల్ గెయిన్.. రూ.230..!!