టైటానిక్ సబ్‌మెర్‌సిబుల్‌ నుంచి బయటపడ్డ మరిన్ని మానవ అవశేషాలు

- October 12, 2023 , by Maagulf
టైటానిక్ సబ్‌మెర్‌సిబుల్‌ నుంచి బయటపడ్డ మరిన్ని మానవ అవశేషాలు

యూఏఈ: జూన్‌లో టైటానిక్‌ శిథిలాలను చూసేందుకు వెళుతున్న క్రమంలో పేలిపోయిన ప్రైవేట్ యాజమాన్యంలోని సబ్‌మెర్సిబుల్ నుండి మరిన్ని శిధిలాలు, అనుమానిత మానవ అవశేషాలు స్వాధీనం చేసుకున్నట్టు యుఎస్ కోస్ట్ గార్డ్ తెలిపింది. టైటాన్ అనే పేరుతో యూఎస్-ఆధారిత కంపెనీ OceanGate ఈ మిషన్ ను చేపట్టింది. సబ్‌లో ఉన్న మొత్తం ఐదుగురు వ్యక్తులు పేలుడులో మరణించారు. ఇది జూన్ 18న జరిగిందని భావిస్తున్నారు. సబ్ పేలిన విషయాన్ని జూన్ 22న నిర్ధారించారు. ఈ ప్రమాదంపై కోస్ట్ గార్డ్ మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అనే అత్యున్నత స్థాయి దర్యాప్తును ప్రారంభించింది. "కోస్ట్ గార్డ్ యొక్క మెరైన్ బోర్డ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (MBI)తో ఉన్న మెరైన్ సేఫ్టీ ఇంజనీర్లు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రం సముద్రపు అడుగుభాగం నుండి మిగిలిన టైటాన్ సబ్‌మెర్సిబుల్ శిధిలాలను స్వాధీనం చేసుకున్నారు. " అని US కోస్ట్ గార్డ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపింది. ప్రమాదం జరిగిన సమయంలో టైటాన్‌లో ఉన్న ఐదుగురు వ్యక్తులలో దుబాయ్ నివాసి, బ్రిటీష్ అన్వేషకుడు హమీష్ హార్డింగ్, ఫ్రెంచ్ జలాంతర్గామి నిపుణుడు పాల్-హెన్రీ నార్గోలెట్, పాకిస్తానీ-బ్రిటీష్ వ్యాపారవేత్త షాజాదా దావూద్, అతని కుమారుడు సులేమాన్, సబ్ ఆపరేటర్ ఓషన్‌గేట్ ఎక్స్‌పెడిషన్స్ CEO స్టాక్‌టన్ రష్ ఉన్నారు. న్యూఫౌండ్లాండ్ తీరానికి 400 మైళ్ల దూరంలో మిషన్ బేస్ నుంచి 1,600 అడుగుల (500 మీటర్లు) దూరంలో టైటానిక్ శిధిలాలను గుర్తించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com