జుమేరాలో డ్రైవర్‌లెస్ ట్యాక్సీల టెస్ట్ డ్రైవ్
- October 13, 2023
దుబాయ్: డ్రైవర్‌లేని టాక్సీలు ఇప్పుడు దుబాయ్ వీధుల్లో... జుమేరా 1 ప్రాంతంలో తిరుగుతున్నాయని,రోడ్లు మరియు రవాణా అథారిటీ (RTA) ప్రకటించింది. అయితే, డ్రైవర్ లెస్ టాక్సీలు ఇప్పటికీ ట్రయల్ దశలోనే ఉన్నాయని, అంటే ప్రయాణీకులను వాటిల్లోకి అనుమతించరని పేర్కొంది. టెస్ట్ డ్రైవ్ లో భాగంగా నిర్వహిస్తున్న ట్రయల్స్ లో ఆయా కార్లలో భద్రతా డ్రైవర్ ఉన్నారని తెలిపింది. ఆర్టిఎలోని పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ఏజెన్సీ, ట్రాన్స్‌పోర్టేషన్ సిస్టమ్స్ డైరెక్టర్ ఖలీద్ అల్ అవధి మాట్లాడుతూ.. స్వయంప్రతిపత్త టాక్సీ - జనరల్ మోటార్స్ (జిఎమ్) అనుబంధ సంస్థ అయిన యుఎస్‌కు చెందిన సెల్ఫ్ డ్రైవింగ్ టెక్నాలజీ కంపెనీ క్రూజ్ ద్వారా నిర్వహించబడుతుందని చెప్పారు. 2024 ద్వితీయార్థంలో పూర్తి వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించే అవకాశం ఉందన్నారు.
క్రూయిజ్ టాక్సీలు ముగ్గురు ప్రయాణీకులకు వసతి కల్పిస్తాయి. సెల్ఫ్ డ్రైవింగ్ టాక్సీలకు RTA ఇంకా ఛార్జీలను నిర్ణయించలేదని అల్ అవధి గతంలో పేర్కొన్నారు. అయితే ఇది దుబాయ్‌లోని సాధారణ క్యాబ్‌ల కంటే సాధారణంగా 30 శాతం ఎక్కువగా ఉండే లైమో ట్యాక్సీలతో పోల్చదగినదని తెలిపారు. వచ్చే ఏడాది జుమేరా ప్రాంతంలో మరిన్ని డ్రైవర్ లెస్ టాక్సీలను ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు. 2030 నాటికి దుబాయ్‌లో 4,000 డ్రైవర్‌లెస్ క్యాబ్‌లను ప్రవేశపెడతామని తెలిపారు.
తాజా వార్తలు
- చెన్నై పై ఆర్సీబీ ఘనవిజయం
- గ్లోబల్ స్పోర్ట్స్ హబ్ గా తెలంగాణ: సీఎం రేవంత్
- పాన్ కార్డు కొత్త రూల్స్..
- యూఏఈ అధ్యక్షుడు–ఇటలీ ప్రధాని భేటీ
- హైదరాబాద్‌లో మూడో భారీ బస్ టెర్మినల్
- ‘ఉగాది గీతాంజలి’ వేడుకలో మెరిసిన మలేషియా–భారత సాంస్కృతిక బంధాలు
- లూలూ హైపర్ మార్కెట్ లో షాప్ నౌ, పే లేటర్..!!
- అల్ సువైఖ్లో ఇద్దరు ఆసియా జాతీయులు అరెస్టు..!!
- మాల్స్ పార్కింగ్ ఏరియాల్లో గాలి నాణ్యతపై కీలక అప్డేట్..!!
- కంపెనీలు ఉద్యోగుల తొలగింపులను నివారించవచ్చా?









