‘లియో’ బెనిఫిట్ షోస్.! విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.!

- October 13, 2023 , by Maagulf
‘లియో’ బెనిఫిట్ షోస్.! విజయ్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.!

ఇళయ దళపతి విజయ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న సినిమా ‘లియో’. విజయ్ కెరీర్‌లోనే భారీ బడ్జెట్ సినిమాగా ఈ సినిమా రూపొందుతోంది. సీనియర్ నటుడు అర్జున్ ఈ సినిమాలో ఓ ఇంపార్టెంట్ స్టన్నింగ్ రోల్ పోషిస్తుండగా, బాలీవుడ్ ప్రముఖ నటుడు సంజయ్ దత్ విలన్ రోల్‌లో కనిపిస్తున్నారు.

రీసెంట్‌గా రిలీజ్ చేసిన ట్రైలర్‌కి భారీ రెస్పాన్స్ వచ్చింది. ట్రైలర్‌తోనే విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారనుకుంటుండగా.. తమిళనాడు ప్రభుత్వం ఫ్యాన్స్ కోసం మరో ఖుషీ న్యూస్ రివీల్ చేసింది.

ఈ సినిమాకి బెనిఫిట్ షోస్ వేసుకునేందుకు అనుమతినిచ్చింది. ఈ నెల 19న సినిమా వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. 19 ఉదయం 4 గంటల నుంచి రెండు బెనిఫిట్ షోస్‌కి ప్రభుత్వం నుంచి అనుమతి లభించింది.

అలాగే, 20 నుంచి 24 వరకూ ఉదయం ఒక ఎక్స్‌ట్రా షో ప్రదర్శించుకునేందుకు కూడా అనుమతిచ్చింది. దాంతో, విజయ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో మునిగి తేలుతున్నారు.

 ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకను అనివార్య కారణాలతో ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదికగా పెద్ద ఎత్తున ఫ్యాన్స్ రచ్చ చేశారు.  అయితే, బెనిఫిట్ షోలకు అనుమతిచ్చి ఫ్యాన్స్ మెప్పు పొందింది తమిళనాడు గవర్నమెంట్.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com