బిగ్‌బాస్‌కి వాళ్లంటే నచ్చడం లేదా.?

- October 16, 2023 , by Maagulf
బిగ్‌బాస్‌కి వాళ్లంటే నచ్చడం లేదా.?

బిగ్‌బాస్ అంటేనే ఎంటర్‌టైన్‌మెంట్‌తో పాటూ, గ్లామర్ కూడా. అయితే, ఈ సారి బిగ్ బాస్ షోలో ఎంటర్‌టైన్‌మెంట్ సంగతి అటుంచితే, బొత్తిగా బిగ్‌బాస్ ‌‌కి ఆడ వాసన పడడం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయ్.

ఎందుకంటే, ఈ సారి కంటెస్టెంట్స్‌లో గ్లామర్ చాలా తక్కువగా కనిపిస్తోంది. అంటే లేడీ కంటెస్టెంట్లు తగ్గించేస్తున్నారు.

ఎలిమినేషన్‌లో భాగంగా కేవలం అమ్మాయిల్ని మాత్రమే బయటికి పంపించేస్తున్నారు. తొలి ఎలిమినేషన్‌లో భాగంగా కిరణ్ రాధోడ్‌నీ, ఆ తర్వాత షకీలాని ఎలిమినేట్ చేశారు. సర్లే సీనియర్లు కదా.. అనుకుంటే, ఆ తర్వాత నుంచీ కూడా అదే పని చేస్తున్నాడు బిగ్‌బాస్.

కేవలం లేడీ కంటెస్టెంట్లను మాత్రమే వరుసగా పంపించేస్తున్నాడు. మంచి స్టఫ్ ఇవ్వదగ్గ గ్లామర్ బ్యూటీస్‌ని సైతం ఎలిమినేట్ చేయడంపై బిగ్‌బాస్‌పై విమర్శలు వస్తున్నాయ్.

లేటెస్ట్‌గా ఉల్టా ఫుల్టాలో భాగంగా బిగ్‌బాస్ 2.0 అంటూ మళ్లీ ముగ్గురమ్మాయిల్ని లోపలికి పంపించాడు. నలుగురు అబ్బాయిల్ని కూడా.

ఒకింత గ్లామర్ యాడ్ అయ్యిందిలే అనుకునే లోపు మళ్లీ ఫీమేల్ కంటెస్టెంట్‌ని బయటికి తోసేశాడు. లేటెస్ట్‌గా హౌస్‌లోకి వెళ్లిన నయనీ పావని ఎలిమినేట్ చేసేశాడు. అసలేం జరుగుతోంది బిగ్‌బాస్‌లో. మరీ ఇంత బోర్ కొట్టించేస్తున్నాడెందుకు.? అని వీక్షకులు ఫీలవుతున్నారు. ఇంతవరకూ ఒక్క మేల్ కంటెస్టెంట్ కూడా హౌస్ నుంచి బయటకి వెళ్లకపోవడం ఆశ్చర్యం.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com