బీపీ వున్నవాళ్లు ఈ ఆహారం తీసుకుంటున్నారా.?
- October 16, 2023
ప్రస్తుత పరిస్థితుల్లో బీపీ అనేది చాలా చాలా సర్వసాధారణంగా మారింది. అయితే, హైబీపీతోనే ప్రాబ్లెమ్ కానీ, నార్మల్ బీపీ లెవల్‌తో ఎటువంటి సమస్య వుండదు. అయినా ఒక్కసారి బీపీ ఎటాక్ అయితే, జీవితాంతం అందుకు సంబంధించిన మందులు తీసుకోవాల్సిందే.
మందులతో పాటూ, కొన్ని ఆహార పదార్ధాలను సైతం ఖచ్చితంగా తీసుకోవాల్సి వుంటుంది బీపీతో బాధపడేవారు. అందులో ముఖ్యమైనవి ఫ్యాటీ ఆమ్లాలు ఎక్కువగా వుండే చేపలు. మాంసంతో పోల్చితే, చేపల్లో ఆరోగ్య ప్రయోజనాలు చాలా ఎక్కువ.
అలాగే, ఆకుకూరల్లోనూ అధికమైన పోషకాలుంటాయ్. బీపీ వున్నవాళ్లు ప్రతీరోజూ ఏదో ఒక ఆకుకూరను తమ డైట్లో చేర్చుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. బీట్రూట్ దుంపలోనే కాదు, ఆకులూ ఆరోగ్యమే సుమా.
ముఖ్యంగా బీపీ వున్న వాళ్లు బీట్ రూట్ ఆకుల్ని తింటే కావల్సిన పొటాషియం అందుతుంది. బీట్ రూట్ ఆకుల్ని కూరలా.. సలాడ్‌లా జ్యూస్‌లా చేసుకుని తీసుకోవచ్చు.
డ్రై ఫ్రూట్స్‌లో పిస్తా పప్పు బీపీ పేషెంట్లకు మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. పొటాషియం, కాల్షియంతో పాటూ, బీపీని కంట్రోల్లో వుంచే గుణం పిస్తా పప్పుకుందట.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







