ఆ క్రేజీ కామెడీ హీరోని ఆడియన్స్ మర్చిపోయారా ఏంటీ.?

- October 18, 2023 , by Maagulf
ఆ క్రేజీ కామెడీ హీరోని ఆడియన్స్ మర్చిపోయారా ఏంటీ.?

‘హృదయ కాలేయం’. ‘కొబ్బరి మట్ట’ వంటి చిత్రాలతో తనదైన స్పూఫ్ కామెడీ చేసి సెపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్‌తో పాటూ, సంచలనాలు సృష్టించిన హీరో సంపూర్ణేష్ బాబు.

సంపూర్ణేష్ బాబు కేవలం సినీ నటుడు మాత్రమే కాదు, వ్యక్తిగతంగా చాలా మనసున్న వ్యక్తి. అందుకేనేమో, స్వతహాగానే ఆయనను అభిమానించే వాళ్లు చాలా మంది వున్నారు.
ధియేటర్లలో ఆయన సినిమాలకు చప్పట్లు, విజిల్స్‌తో పాటూ, తన మార్కెట్‌కి తగ్గట్టుగా బాక్సాఫీస్ వద్ద కాసుల పంట కూడా బాగానే పండేది. అయితే, ఈ మధ్య సంపూర్ణేష్ సినిమాలకు కాస్త దూరంగా వుంటున్నారు.

తాజాగా ఆయన ‘మార్టిన్ లూథర్ కింగ్’ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇదో డిఫరెంట్ కామెడీ సినిమా. తమిళంలో యోగిబాబు ప్రధాన పాత్రలో వచ్చిన సూపర్ హిట్ మూవీకి తెలుగు రీమేక్ ఈ చిత్రం.

ఈ సినిమాని ఈ నెల 27న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు సంపూర్ణేష్ బాబు. అయితే, సంపూర్ణేష్ బాబు సినిమాలకు ప్రీ రిలీజ్ హంగామా చాలా చాలా ఎక్కువగా వుంటుంది. కానీ ఈ సినిమా విషయంలో ఆ స్థాయి హడావిడి కనిపించడం లేదు. అక్కడికే పెయిడ్ ప్రమోషన్లు ఆల్రెడీ షురూ చేశారు. కానీ, ఎందుకో బజ్ క్రియేట్ కావడం లేదు. యోగిబాబు సినిమాలకు తమిళంలోనే కాదు, తెలుగులోనూ ఫాలోయింగ్ వుంది. అతని కామెడీ స్టైలింగ్ అలాంటిది.

ఆయన సినిమాని రీమేక్ చేస్తున్న మన సంపూర్ణేష్ బాబు ఏం తక్కువ.. ఈయన అంతకన్నా ఎక్కువ. చూడాలి మరి, ‘మార్టిన్ లూథర్ కింగ్’ ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేస్తుందో.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com