రష్మిక విషయంలో అదంతా ఉత్తదేనట.!
- October 18, 2023
కన్నడ కస్తూరి రష్మిక మండన్నా బాలీవుడ్ చిత్రం ‘యానిమల్’ త్వరలో రిలీజ్‌కి సిద్ధంగా వున్న సంగతి తెలిసిందే. రష్మిక ఇంతవరకూ నటించిన బాలీవుడ్ చిత్రాలన్నీ ఓ ఎత్తు. ఈ చిత్రం ఇంకో ఎత్తు.
సందీప్ రెడ్డి తన మార్క్ వయలెంట్ యాక్షన్‌ని ఈ సినిమాలో చూపించబోతున్నాడనీ ప్రచారం జరుగుతోంది. అలాగే, ‘అర్జున్ రెడ్డి’కి మించిన బోల్డ్ సన్నివేశాలు ఈ సినిమాలో వుండబోతున్నాయని చాలా గట్టిగా మాట్లాడుకుంటున్నారు.
కేవలం లిప్ లాక్సే కాదంట.. ఇంటిమేట్ సీన్లలోనూ రష్మిక నటించిందట. ఆ సీన్లు సినిమాకి హైలైట్ అవుతాయట.. ఇలాంటి ప్రచారాలు జోరందుకుంటున్నాయ్. అంతేకాదట.. అంత బోల్డ్‌గా నటించడానికి రెమ్యునరేషన్ కూడా గట్టిగా డిమాండ్ చేసిందనీ మాట్లాడుకుంటున్నారు.
అయితే, రష్మిక మాత్రం అలాంటిదేమీ లేదని తన టీమ్ ద్వారా చెప్పిస్తోందట. ‘యానిమల్’ ఓ డిఫరెంట్ చిత్రమనీ.. ఖచ్చితంగా ఈ సినిమాతో బాలీవుడ్‌లో సక్సెస్ అవుతాననీ నమ్మకం వ్యక్తం చేస్తోంది రష్మిక మండన్నా. అలాగే, తనపై వచ్చే ఎలాంటి రూమర్లనూ నమ్మవద్దని అంటోంది. నేషనల్ క్రష్ రష్మిక.. ఆమెపై ఎలాంటి రూమర్లు వచ్చినా అదో క్రేజే. అంతేకాదు, ఆమె రెస్పాన్స్ కూడా అంతే క్రేజీ వుంటుంది. దటీజ్ రష్మిక మండన్నా.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







