హెర్నియా వృద్ధుల్లోనే వస్తుందా.? ఎందుకొస్తుంది.? ట్రీట్‌మెంట్ ఏంటీ.?
- October 18, 2023
50 ఏళ్ల వయసు పైబడిన వారిలో హెర్నియా సర్వ సాధారణంగా చూస్తుంటాం. ఒక మజిల్ లేదా టిష్యూకి ఏర్పడిన అబ్నారం ఓపెనింగ్‌లో నుంచి ఓ నరంలాగా బయటికి రావడాన్ని హెర్నియా అంటారు. ఇది శరీరంలో ఏ భాగంలోనైనా రావచ్చు.
ముఖ్యంగా వయసు పైబడిన వారిలో యూరినల్ సమస్యలున్నవారికి ఈ హెర్నియా వస్తుంది. లేదంటే, గతంలో ఏమైనా సర్జరీలు చేయించుకోవడం వల్ల కూడా హెర్నియా వచ్చే అవకాశాలున్నాయ్. పెద్దగా టెన్షన్ పడే ఆరోగ్య సమస్య కాదు కానీ, ఆ సమయంలో అక్కడి భాగం వాపు కారణంగా భరించలేని నొప్పి వేధిస్తుంది.
ఈ సమస్య నివారణకి సర్జరీనే ప్రిఫర్ చేస్తారు వైద్యులు. సర్జరీకి అనేక రకాల మార్గాలున్నాయ్. ఈ సర్జరీని లాప్రోస్కోపిక్ ద్వారా కానీ, ఓపెన్ సర్జరీ ద్వారా కానీ చేయొచ్చు. ఎలా చేయాలి అన్నది ఆ హెర్నియా లక్షణాన్ని బట్టి ప్రిఫరెన్స్ వుంటుంది.
ఎక్కువ కాలం దగ్గు వేధించడం, యూరినరీ స్ర్టెసింగ్, ఊబకాయం, సర్జరీల వల్ల పెట్టే కోతలు, హెవీ ఎక్సర్ సైజ్ తదితర కారణాలు హెర్నియా సమస్యకు దారి తీసే అవకాశాలున్నాయ్.
హెర్నియా సర్జరీ అనేది ప్రపంచ వ్యాప్తంగా చాలా కామన్‌గా చేసే సర్జరీల్లో ఒకటి. అబ్డామిన్లో కానీ, గజ్జల్లో కానీ, గడ్డలా తగిలితే అది హెర్నియాగా గుర్తించి వైద్యుని సంప్రదించాలి. సర్జరీ తర్వాత కొన్ని నెలల పాటు ఈ సమస్య వుండకపోవచ్చు. అలాగే, మళ్లీ సమస్య పునరావృతం కూడా కావచ్చు.
అన్నట్లు హెర్నియా పురుషుల్లోనూ, స్త్రీలల్లోనూ, పిల్లల్లోనూ కూడా కనిపించే అవకాశాలున్నాయ్. ఇదేమంత ప్రాణాంతక సమస్య కాదు కానీ, ఒకింత నొప్పితో కూడుకున్న సమస్య.
తాజా వార్తలు
- రాజమండ్రి-తిరుపతి కొత్త విమానాలు ఎప్పుడంటే?
- హెచ్-1బీ వీసా ఫీజు పెంపు..
- దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీలకు ఈసీ షాక్: గుర్తింపు రద్దు
- టీటీడీకి రూ.10 లక్షలు విరాళం
- ఛార్జీల సవరణ ‘దసరా స్పెషల్స్’లోనే స్పష్టం
- దుబాయ్ లో నకిలీ హోటల్ ఫ్లోర్ లీజు..ఇద్దరికి జైలు శిక్ష..!!
- అల్-ముత్లా యాక్సిడెండ్, ఎమర్జెన్సీ సెంటర్ ప్రారంభం..!!
- మహిళకు జీవిత ఖైదు విధించిన బహ్రెయిన్ కోర్టు..!!
- 10 కిలోల మెత్ సీజ్ చేసిన సౌదీ కస్టమ్స్..!!
- ఒమన్‌లో ఐఫోన్ 17 సందడి..!!