‘భగవంత్ కేసరి’.! ఈ సారి బాలయ్యతో మామూలుగా వుండదు.!

- October 18, 2023 , by Maagulf
‘భగవంత్ కేసరి’.! ఈ సారి బాలయ్యతో మామూలుగా వుండదు.!

బాలయ్య బాబు సినిమాలంటే ఓ ఐడియా వుంటుంది అందరికీ. అదిరిపోయే డైలాగులు.. భీభత్సమైన యాక్షన్ ఘట్టాలు, ఓ ఐటెం సాంగ్, హీరోయిన్‌తో కాస్త అటూ ఇటూ రొమాంటిక్ సీన్లు.. ఇదీ ప్యాటర్న్. అయితే, ‘భగవంత్ కేసరి’ వాటన్నింటికీ పూర్తి భిన్నమైన చిత్రంగా అభివర్ణిస్తున్నారు.

ప్రోమోస్‌లోనూ అలాంటి అతికి ఆస్కారమున్నట్లు కనిపించడం లేదు. హీరోయిన్ కాజల్ అగర్వాల్ వున్నప్పటికీ చాలా డిగ్నిఫైడ్ పాత్రలోనే ఆమె కనిపించబోతోందనీ, గ్లామర్‌కి ఎలాంటి తావివ్వలేదనీ తెలుస్తోంది. ఇక లీడ్ రోల్ శ్రీలీల పాత్ర బబ్లీ‌నెస్‌తో కూడిన శక్తివంతమైన పాత్రగా కానవస్తోంది.

దాంతో, ‘భగవంత్ కేసరి’ ఓ విభిన్న తరహా కంటెంట్ మూవీ అని అర్ధమవుతోంది. బాలయ్య, శ్రీలీలకు చిన్నాన్న పాత్రలో కనిపించబోతున్నారు ఈ సినిమాలో. ట్రైలర్‌తో ఇప్పటికే ఓ ఐడియా వచ్చింది. అనిల్ రావిపూడి సినిమాలంటేనే విపరీతమైన కామెడీ, హీరోయిన్ గ్లామర్.. ఎక్స్‌ట్రా ఎక్స్‌ట్రా వుంటాయ్. కానీ, బాలయ్యను ఓ డిఫరెంట్ జోనర్‌లో చూపించాలనుకున్నాడట ఈ సినిమాతో అనిల్ రావిపూడి.

హండ్రెడ్ పర్సంట్ ఆ విషయంలో సక్సెస్ అయ్యానని నమ్మకంగా వున్నాడు. ఒకవేళ అదే నిజమై ‘భగవంత్ కేసరి’ హిట్ అయితే, బాలయ్యకు ఇప్పట్లో తిరుగే లేదు. ఏం జరుగుతుందో చూడాలంటే కొన్ని గంటలు మాత్రమే వెయిట్ చేయాలి. రేపు అనగా అక్టోబర్ 19న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com