ఒమన్‌లో హజ్ యాత్రికుల నమోదు ప్రారంభం

- October 21, 2023 , by Maagulf
ఒమన్‌లో హజ్ యాత్రికుల నమోదు ప్రారంభం
మస్కట్: 1445 AH సంవత్సరానికి హజ్ ఆచారాలను నిర్వహించాలనుకునే యాత్రికుల నమోదును ప్రారంభించినట్లు ఎండోమెంట్స్, మతపరమైన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఒమన్‌లోని పౌరులు, నివాసితులు ఎలక్ట్రానిక్ వెబ్‌సైట్ (www.hajj.om) ద్వారా 23 అక్టోబర్ నుండి 5 నవంబర్ 2023 వరకు నమోదు చేసుకోవచ్చని తెలిపింది. దృష్టి లేదా శారీరక వైకల్యం ఉన్న మగ,  ఆడ యాత్రికులు సహచరులను కలిగి ఉండవచ్చని మంత్రిత్వ శాఖ సూచించింది. మంత్రిత్వ శాఖ అధికారిక పని వేళల్లో సందేహాల కోసం హాట్‌లైన్ (80008008)ను సంప్రదించాలని, అలాగే వెబ్ సైట్ (www.hajj.om) ద్వారా కూడా సందేహాలను నివృతి చేసుకోవాలని సూచించారు.
 
 
 
 
 
 
 
Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com