జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు
- May 23, 2016
అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత మరోసారి తమిళనాడు ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించారు. సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ రోశయ్య మద్రాసు వర్సిటీ అన్నా శత జయంతి స్మారక ఆడిటోరియంలో జయలలితతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఆమె తమిళంలో ప్రమాణం చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా జయ గద్దెనెక్కడం ఇది ఆరోసారి. జయలలితతో పాటు 28మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.2011లో ఇదే వేదిక నుంచే పగ్గాలు చేపట్టిన పురచ్చితలైవి మళ్లీ ప్రజాహిత సుపరిపాలన అందించాలన్న కాంక్షతో ఉన్నారు. జయలలిత ప్రమాణం చేస్తున్న సమయంలో ఆమె మద్దతుదారులు నినాదాలతో హోరెత్తించారు. ఇక మంత్రివర్గ కూర్పులో భాగంగా పన్నీర్ సెల్వంకు ఆర్థిక శాఖ, తెలుగు వ్యక్తి రాజుకు ఐటీ శాఖను అప్పగించారు. అలాగే 13మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకున్నారు.ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రతిపక్ష పార్టీ డీఎంకే నుంచి స్టాలిన్ హాజరు కాగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇరాన్ పర్యటనకు వెళ్లడంతో ఆయన తరఫున కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు హాజరు అయ్యారు. అలాగే ఈ వేడుకకు పలువురు ప్రముఖులు, పార్టీ నేతలు, సినీ ప్రముఖులు విచ్చేశారు. అంతకు ముందు జయలలిత ప్రమాణ స్వీకారానికి పోయెస్ గార్డెన్ నుంచి మద్రాస్ యూనివర్శిటీకి తరలి వస్తున్న సందర్భంగా అభిమానులు, కార్యకర్తలు రోడ్డుకు ఇరువైపుల నిలబడి అమ్మకు ఘన స్వాగతం పలికారు.
తాజా వార్తలు
- జెబల్ అలీ పోర్ట్‌లో యథావిధిగా కార్యకలాపాలు: భద్రతను కట్టుదిట్టం చేసిన అధికారులు!
- సౌదీలో 4రోజలపాటు ఈద్ అల్ ఫితర్ సెలవులు..!!
- వదంతులు, తప్పుడు వార్తల ప్రచారం పై దుబాయ్ పోలీస్ హెచ్చరిక ...
- చరిత్ర సృష్టించిన టీ20 ప్రపంచకప్
- ఫుజైరః ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి చార్టర్ విమాన సర్వీసులు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్‌లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్‌లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!









