తీవ్ర తుఫానుగా మారిన అల్పపీడనం 'హమూన్'..
- October 24, 2023
భువనేశ్వర్: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర తుఫానుగా మారింది. ఈ తుఫానుకి 'హమూన్'గా పేరు పెట్టినట్లు భారత వాతావరణ శాఖ (ఐఎండి) మంగళవారం ప్రకటించింది. ఒడిసాకు 200 కి.మీ దూరంలో తీరం దాటే అవకాశం ఉన్నందున ఒడిసాపై పెద్దగా ప్రభావం ఉండకపోవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. గంటకు 21 కి.మీ వేగంతో దూసుకువస్తున్న ఈ తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని అన్నారు. ఒడిసాలోని పారాదీప్‌కు 230 కి.మీ, పశ్చిమ బెంగాల్‌లోని ధిగాకు 240 కి.మీ దూరంలో, బంగ్లాదేశ్‌లోని చిట్టిగాంగ్‌కు 410 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపారు.
ఈశాన్య దిశగా కదులుతున్న తుఫాను క్రమంగా బలహీనపడి మంగళవారం సాయంత్రానికి తీవ్రంగా మారే అవకాశం ఉందని, గంటకు 65 -75 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తాయని ఐఎండి అంచనా వేసింది. బుధవారం బంగ్లాదేశ్‌లోని హెపుపరా , చిట్టిగాంగ్ మధ్య తీరం దాటే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. తుఫాను ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు ఒడిసాలో మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అన్నారు.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్‌కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్‌తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









