అమలులోకి వచ్చిన వాహన లైసెన్స్ జారీ,పునరుద్ధరణ వార్షిక ఫి

- October 24, 2023 , by Maagulf
అమలులోకి వచ్చిన వాహన లైసెన్స్ జారీ,పునరుద్ధరణ వార్షిక ఫి

రియాద్: వాహనం  ఇంధన సామర్థ్యానికి అనుగుణంగా వాహన రిజిస్ట్రేషన్ లైసెన్స్ (ఇస్తిమారా) జారీ,  పునరుద్ధరణ కోసం సౌదీ అరేబియా వార్షిక రుసుమును వసూలు చేయడం ప్రారంభించింది.  ఇది అక్టోబర్ 22 నుండి అమలులోకి వచ్చింది. మొదటి దశలో.. ఫీజు కేవలం యజమానులకు మాత్రమే వర్తిస్తుంది. రెండవ దశ.. 2024 సంవత్సరంలో అమల్లోకి వస్తుంది. అన్ని తేలికపాటి,  భారీ వాహనాల యజమానులకు వర్తిస్తుంది. వార్షిక రుసుము రెండు ప్రమాణాల ప్రకారం లెక్కించబడుతుంది. వాహన ఇంధన వినియోగ సామర్థ్యాన్ని బట్టి రుసుమును ఐదు స్థాయిలుగా విభజించారు. వాహన లైసెన్సుల జారీ మరియు పునరుద్ధరణకు వారి ఇంధన సామర్థ్యాన్ని బట్టి వార్షిక రుసుమును వసూలు చేయాలని 2021 ఆగస్టులో మంత్రి మండలి నిర్ణయించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com