యూఏఈ: వడగళ్ల వాన, ఉరుములతో కూడిన వర్షాలు.. పలు ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్
- October 26, 2023
యూఏఈ: దేశంలోని చాలా ప్రాంతాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్‌లను జాతీయ వాతావరణ కేంద్రం (NCM) జారీ చేసింది. బుధవారం యూఏఈలో వర్షాలు కురిసాయి. నివాసితులు ఆరుబయట వెళ్లేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. అబుదాబి పోలీసులు కూడా నివాసితులకు - ముఖ్యంగా వాహనదారులకు హెచ్చరిక సందేశాలను పంపారు. రోడ్లన్నీ నీటితో నిండిపోతున్నందున వాహనదారులు వాహనాలు నడిపే సమయంలో అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఎలక్ట్రానిక్ సైన్ బోర్డులపై ప్రదర్శించబడే మారుతున్న వేగ పరిమితులను తప్పనిసరిగా పాటించాలని సూచించారు. రస్ అల్ ఖైమాలోని కొన్ని ప్రాంతాలు కూడా వడగళ్ళు, ఉరుములతో కూడిన వర్షాలు పడ్డాయి. X హ్యాండిల్(ట్విటర్) స్టార్మ్ సెంటర్ రస్ అల్ ఖైమా విమానాశ్రయానికి సమీపంలో గాలి వాన కారణంగా చెట్టు ఊగుతున్న వీడియోను పోస్ట్ చేసింది.
الامارات : الان هطول أمطار الخير على خت ومطار رأس الخيمة #اخدود_مطلع_الوسم #مركز_العاصفة
— مركز العاصفة (@Storm_centre) October 25, 2023
25_10_2023 pic.twitter.com/P4JCqyd7Tw
తాజా వార్తలు
- $29.6 బిలియన్లకు ఖతార్-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్యం..!!
- జనవరి 1 నుండి అధికారిక ఛానెల్స్ ద్వారానే సాలరీ..!!
- ఈ క్రిస్మస్కు డబ్బు ఆదా చేయాలనుకుంటున్నారా?
- 7.57లక్షల మంది కార్మికులకు బ్యాంక్ అకౌంట్లు లేవు..!!
- కొత్త OMR 1 నోటు జారీ చేసిన CBO ..!!
- అల్ అరీన్ రిజర్వ్ కు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ పేరు..!!
- ఫోర్బ్స్ అత్యంత సంపన్న దేశాలలో ఖతార్..!!
- ISB ప్లాటినం జూబ్లీ ఫెస్టివల్..టిక్కెట్లు విడుదల..!!
- ఒమన్ లో వాహనదారులకు కీలక సూచనలు..!!
- రియాద్ విమానాశ్రయంలో విమానాల ఆలస్యంపై సమీక్ష..!!







