హజ్ తీర్థయాత్ర రాకెట్‌: 150 మంది నివాసితులను మోసం చేసిన టూర్ ఆపరేటర్ అరెస్ట్

- October 26, 2023 , by Maagulf
హజ్ తీర్థయాత్ర రాకెట్‌: 150 మంది నివాసితులను మోసం చేసిన టూర్ ఆపరేటర్ అరెస్ట్

యూఏఈ: హజ్ తీర్థయాత్ర రాకెట్ వెనుక ఉన్న టూర్ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు. షార్జాకు చెందిన బైతుల్ అతీక్ ట్రావెల్ ఏజెన్సీని నడుపుతున్న 44 ఏళ్ల షబిన్ రషీద్‌ను దుబాయ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. హజ్‌కు వెళ్లాలని భావించే దాదాపు 150 మంది యూఏఈ ఆధారిత వ్యక్తులను మోసం చేసి, లక్షలాది దిర్హామ్‌లను కోల్పోయారని భారతీయ ప్రవాసి ఒకరు ఆరోపించారు.  ముందుగా పూర్తి చెల్లింపులు చేసినప్పటికీ, ఎవరూ పవిత్ర తీర్థయాత్ర చేయలేకపోయారు. ఈ క్రమంలో రషీద్ క్షమాపణలు చెప్పాడు.  వీసా జారీలో చివరి నిమిషంలో మార్పు సమస్యలకు కారణమైందని పేర్కొన్నారు. మొదట బుక్ చేసిన వసతి గృహాలను తిరిగి విక్రయించడం ద్వారా వచ్చిన నిధులను తిరిగి ఇస్తానని ప్రకటించారు.  అనంతరం మోసానికి పాల్పడ్డాడు. దీంతో చాలా మంది రషీద్‌పై ఫిర్యాదులు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. గత ఏడాది 20,000 దిర్హామ్‌లు చెల్లించిన దుబాయ్ నివాసి సాక్విబ్ ఇమామ్, ఇప్పటివరకు తనకు 5,000 దిర్హామ్‌లు మాత్రమే అందాయని చెప్పారు. తీర్థయాత్రకు వెళ్లేందుకు 130,000 చెల్లిస్తే.. 13 శాతం మాత్రమే రిఫండ్ చేసినట్లు షార్జాలోని ఒక నివాసి వెల్లడించారు.  ఇలా పలువరు బాధితులు పోలీసులు ఫిర్యాదులు చేశారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com