లీలమ్మా.! దుమ్ము దులిపేశావమ్మా.!
- October 26, 2023
శ్రీలీల చేతిలో వున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టుల్లో ‘భగవంత్ కేసరి’ రీసెంట్గా ప్రేక్షకుల ముందుకొచ్చి దుమ్ము దులుపుతోన్న సంగతి తెలిసిందే. ఇక, నవంబర్‌లో ‘ఆది కేశవ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీలీల.
మెగా కాంపౌండ్ హీరో వైష్ణవ్ తేజ్ పంజా ప్రధాన పాత్రలో వస్తున్న ‘ఆది కేశవ్’ ప్రచార చిత్రాలు ఆకట్టుకుంటున్నాయ్. ఇప్పటికే రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ అయ్యాయ్. రెండింట్లోనూ శ్రీలీల, వైష్ణవ్ తేజ్ జోడీ క్యూట్ క్యూట్‌గా కనిపిస్తోంది.
అలాగే, శ్రీలీల డాన్సులు క్లాస్ అండ్ మాస్ స్టెప్పులు యూత్‌ని ఉర్రూతలూగిస్తున్నాయ్. తాజాగా రిలీజ్ చేసిన ‘లీలమ్మో..’ సాంగ్ అయితే, కిర్రాకెత్తిస్తోంది. ఈ పాటలోని శ్రీలీల కాస్ట్యూమ్స్.. మాస్ స్టెప్పులు, ఊర మాస్ ఎక్స్ప్రెషన్లు.. ఇలా ఒక్కటేమిటి అన్నీ సూపర్బ్‌గా సెట్టయ్యాయ్.
నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ‘ఆది కేశవ్’పై అంతకంతకూ అంచనాలు పెరుగుతున్నాయ్. నిజానికి ఆగస్ట్‌లోనే ఈ సినిమా రిలీజ్ కావల్సి వుండగా, అనివార్య కారణాల వల్ల వాయిదా పడింది.
నవంబర్ 10న గ్రాండ్‌గా రిలీజ్ కాబోతోంది. వైష్ణవ్ తేజ్ పంజాకి నాలుగో సినిమాగా వస్తున్న ‘ఆది కేశవ్’.. అటు వైష్ణవ్కీ, ఇటు శ్రీలీలకీ మంచి హిట్టివ్వడం ఖాయమని అంటున్నారు. చూడాలి మరి.
తాజా వార్తలు
- తెలంగాణలో ₹1,000 కోట్ల స్టార్టప్ ఫండ్ ప్రకటించిన సీఎం రేవంత్
- తిరుమలలో మరో స్కామ్: నకిలీ పట్టు దుపట్టా మోసం
- మాలికి ట్రావెల్ బ్యాన్..వెంటనే తిరిగిరండి..!!
- ఒమన్ లో అంతర్జాతీయ అవినీతి వ్యతిరేక దినోత్సవం..!!
- దర్బ్ అల్ సయ్ లో నేషనల్ డే కార్యకలాపాలు..!!
- సౌదీ అరేబియాలో సీజనల్ రెయిన్ ఫాల్..!!
- మనమా సౌక్.. మనమా ఆత్మ, హార్ట్ బీట్..!!
- కువైట్ చేరిన ఇండియన్ కోస్ట్ గార్డు షిప్ సర్థాక్..!!
- ఎన్నికల తేదీల కోసం జనాల ఎదురు చూపులు: కేటీఆర్
- దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!







