సాదియా 'తవక్కల్నా సర్వీసెస్' యాప్ డెవలప్ వెర్షన్ ఆవిష్కరణ
- October 27, 2023
రియాద్: సాంకేతిక పురోగతి దిశగా, సౌదీ డేటా మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అథారిటీ (SDAIA) గురువారం "తవక్కల్నా సర్వీసెస్" అప్లికేషన్ తాజా అప్డేట్ వెర్షన్ ను ఆవిష్కరించింది. అప్‌గ్రేడెడ్ వెర్షన్ ప్రభుత్వ మరియు ప్రైవేట్ ఏజెన్సీలు, పౌరులు, నివాసితులు మరియు సందర్శకులకు అనుభవాన్ని అందించడానికి రూపొందించబడిన కొత్త సేవలు, డిజిటల్ ఫీచర్లను కలిగి ఉంటుంది. రియాద్‌లోని ఫోర్ సీజన్స్ హోటల్లో జరిగిన ఆవిష్కరణ కార్యక్రమంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ సీనియర్ అధికారులు పాల్గొన్నారు. SDAIA అధ్యక్షుడు డాక్టర్ అబ్దుల్లా అల్-గమ్డి మాట్లాడుతూ.. రెండు పవిత్ర మసీదుల సంరక్షకుడు, రాజు సల్మాన్ , క్రౌన్ ప్రిన్స్ మద్దతుగా నిలిచారని, వారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు. రోజువారీ మానవ జీవితంలో డేటా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీలు కీలక పాత్రను పోషిస్తున్నాయని డాక్టర్ అల్-గమ్డి చెప్పారు.
తాజా వార్తలు
- 30న అంబేద్కర్ ఓపెన్ వర్సిటీ 26వ స్నాతకోత్సవం
- హెచ్-1బీ వీసాల పై ట్రంప్ నిర్ణయం …
- ఆసియా కప్ ఫైనల్లో భారత్–పాకిస్థాన్ పోరు
- నేరగాళ్లను నేపాల్, ఉజ్బెకిస్తాన్ అధికారులకు అప్పగింత..!!
- కువైట్ లో 5,800 ట్రాఫిక్ వయోలేషన్స్, 153 మంది అరెస్టు..!!
- యాన్యువల్ నావల్ ఎక్సర్ సైజ్ సీ లయన్ ముగింపు..!!
- జూలైలో 30.4% పెరిగిన సౌదీ నాన్ ఆయిల్ ఎగుమతులు..!!
- సల్వా – ఈస్ట్ ఇండస్ట్రియల్ రోడ్ బ్రిడ్జ్ మూసివేత..!!
- బహ్రెయిన్ లో ఇథియోపియన్ మెస్కెల్ ఫెస్టివల్..!!
- రెండు రోజులు భారీ వర్షాలు.. అధికారులకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు..