అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం

- October 28, 2023 , by Maagulf
అలిపిరి నడకమార్గంలో మళ్లీ చిరుత కలకలం

తిరుమల: అలిపిరి నడకమార్గాన్ని చిరుతలు వదిలిపెట్టడం లేదు. ఇప్పటికే దాదాపు 7 చిరుతలు బందించి అడవిలో వదిలిపెట్టినప్పటికీ..తాజాగా శుక్రవారం మరో చిరుత కనిపించింది. అలిపిరి నడకమార్గంలో దృశ్యాలను పరిశీలించగా పులి, ఎలుగుబంటి సంచిరిస్తున్నట్టుగా గుర్తించారు. లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం సమీపంలో వన్యప్రాణులు కనిపించాయి. పులి, ఎలుగుబంటి ఉన్నట్లు నిర్ధారించిన TTD అధికారులు గుంపులుగా తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ యాత్రికులు నడక మార్గంలో ప్రయాణించరాదని హెచ్చరిస్తున్నారు.

అలిపిరి నడక మార్గంలో నరశింహస్వామి ఆలయం నుంచి 7వ మైలు ప్రాంతంలో చిరుత, ఎలుగుబంటి సంచారాన్ని గుర్తించిన అటవీ శాఖ సిబ్బంది భక్తులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. గత మూడు రోజులుగా వేకువ జామున, రాత్రి సమయాలలో చిరుతలు సంచరిస్తున్నట్టుగా గుర్తించారు. గతంలో దాడులు చేసిన ప్రాంతంలోనే రెండు చిరుతల సంచారాన్ని గుర్తించిన సిబ్బంది….భధ్రతా సిబ్బందిని టీటీడీ అప్రమత్తం చేసింది. నడకదారిలో 24 న రాత్రి 8 గంటల సమయంలో చిరుత సంచారంపై కెమెరా ట్రాప్ లో గుర్తించారు. 10 రోజుల్లో రెండుసార్లు చిరుత సంచారం అందరిలో వణుకుపుట్టిస్తోంది. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తం ఉండాలని సూచించారు అటవీశాఖ అధికారులు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com