డీకే కామెంట్స్ తో తలలు పట్టుకుంటున్న TPCC నేతలు
- October 29, 2023
హైదరాబాద్: ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని మరింత స్పీడ్ చేసింది. కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్, కర్ణాటక ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్..నిన్న తెలంగాణ ప్రచారంలో పాల్గొన్నారు. విద్యుత్ విషయంలో బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు బలం చేకూరుస్తూ.. కర్ణాటకలో తమ ప్రభుత్వం వ్యవసాయానికి 5 గంటల విద్యుత్ ఇస్తోందని ప్రకటించారు. ఓవైపు బీఆర్ఎస్‌కు ధీటుగా.. తాము కూడా 24 గంటల విద్యుత్ ఇస్తామని తెలంగాణ కాంగ్రెస్ నేతలు హామీలు ఇస్తుంటే.. డీకే మాత్రం తాము 5 గంటల విద్యుత్ ఇస్తున్నామని, అదే గొప్పగా చెప్పడం తెలంగాణ కాంగ్రెస్ నేతలకు షాక్ ఇచ్చింది. ఇలా మాట్లాడుతున్నాడేంటి అని వారంతా అవాక్ అయ్యారు. శనివారం తాండూరులో నిర్వహించిన విజయభేరి కార్నర్ మీటింగ్‌లో డీకే ఈ వ్యాఖ్యలు చేసారు.
ఇప్పటికే తెలంగాణలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ అందిస్తున్నామని బీఆర్ఎస్ ప్రభుత్వం చెబుతోంది. కాంగ్రెస్ కూడా అదే హామీ ఇస్తోంది. తాము అధికారంలోకి వస్తే.. 24 గంటల విద్యుత్ ఇస్తామని హామీ ఇస్తోంది. ఇంతలో.. తాము కర్ణాటకలో 5 గంటల విద్యుత్ మాత్రమే ఇస్తున్నామని డీకే ప్రకటించడంతో.. కాంగ్రెస్ శ్రేణుల పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్లుగా మారింది. డీకే వ్యాఖ్యలు తమకు నష్టం కలిగిస్తాయనే ఆందోళనలో కాంగ్రెస్ శ్రేణులు ఉన్నాయి. బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. కాంగ్రెస్ వస్తే కరెంట్ కట్ అని, డీకే వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనం అని ప్రచారం మొదలుపెట్టారు.
తాజా వార్తలు
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్‌గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్‌పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు







