త్వరలో.. విజయవాడలో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం
- October 29, 2023
అమరావతి: ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో విశాఖపట్నం తర్వాత రెండో ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం విజయవాడలో ఏర్పాటు కానుంది. ఇప్పటి వరకు విజయవాడలో ప్రాంతీ య పాస్‌పోర్టు సేవా కేంద్రం(RPSK) మాత్రమే ఉంది. పూర్తిస్థాయి ప్రాంతీయ కార్యాలయం లేకపోవడంతో పాస్‌పోర్టుల ముద్రణ, డిస్పాచ్ అంతా విశాఖ కేంద్రంగానే జరుగుతోంది. ఇప్పుడు విజయవాడకు ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయాన్ని మంజూరు చేస్తూ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ కార్యాలయాన్ని బందరు రోడ్డు వెంబడి గవర్నర్‌పేటలోని ఏజీ ఆఫీసు భవనంలో ఏర్పాటు చేస్తున్నారు. దీంతో ఇకపై పాస్‌పోర్టు సంబంధిత సమస్యల పరిష్కారానికి రాయలసీమ, కోస్తాంధ్ర వాసులు విశాఖ వరకూ వెళ్లాల్సిన అవసరం ఉండ దు. కాగా, విజయవాడ పాస్‌పోర్టు కార్యాలయం కొత్త సంవత్సరంలో అందుబాటులోకి వస్తుందని నూతన రీజనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ కె.శివహర్ష అన్నారు. శనివారం ఆయన మాట్లాడుతూ.. విజయవాడ, తిరుపతిలో ఉన్న ప్రాంతీయ పాస్‌పోర్టు సేవా కేంద్రాలతో పాటు 13 పీవోపీఎ్సకేల్లో రోజుకు సగటున 2వేల చొప్పున ఇప్పటి వరకు 3 లక్షల దరఖాస్తులు స్వీకరించినట్లు వివరించారు.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







