నవంబర్‌లో పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

- October 31, 2023 , by Maagulf
నవంబర్‌లో పెరుగనున్న పెట్రోల్, డీజిల్ ధరలు?

యూఏఈ: యూఏఈ ఇంధన ధరల కమిటీ మంగళవారం నవంబర్‌ నెలకు సంబంధించి సవరించిన రిటైల్ పెట్రోల్ మరియు డీజిల్ రేట్లను గ్లోబల్ రేట్లను ప్రకటించనుంది. ముడిచమురుకు అధిక డిమాండ్‌తో అంతర్జాతీయంగా పెరిగిన ధరల కారణంగా యూఏఈ వరుసగా నాలుగు నెలలుగా పెట్రోల్ ధరలను పెంచుతూ వస్తుంది. అక్టోబర్‌లో రిటైల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. ప్రస్తుతం, సూపర్ 98 పెట్రోల్ ధర లీటర్ దిర్హామ్ 3.44, స్పెషల్ 95 ధర లీటరుకు 3.33 దిర్హామ్ మరియు ఇ-ప్లస్ ధర 3.26 దిర్హాం. డీజిల్ ధర లీటరు 3.57 దిర్హాంలుగా ఉన్నాయి. 2015 నుండి యూఏఈ స్థానిక రిటైల్ ఇంధన ధరలను గ్లోబల్ రేట్ల ఆధారంగా నిర్ణయించడం ప్రారంభించింది. ప్రపంచ ధరలకు అనుగుణంగా ప్రతి నెలాఖరులో ధరలు సవరిస్తున్నారు. అయితే, ఇజ్రాయెల్ మరియు పాలస్తీనియన్ల మధ్య యుద్ధం నేపథ్యంలో అక్టోబర్‌లో అంతర్జాతీయ చమురు ధరలు పెరిగాయి. అక్టోబరులో బ్రెంట్ ధర మొదటి వారంలో $90.9 నుండి $84 మధ్య హెచ్చుతగ్గులకు లోనైంది.  అక్టోబర్ 19న $92.38కి ఎగబాకి, అక్టోబర్ 30న మధ్యాహ్న సమయానికి బ్యారెల్ $89.54 వద్ద కొద్దిగా తగ్గింది.   

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com