యూఏఈలో నాన్-రెసిడెంట్స్ కోసం కొత్త టాక్స్ రూల్స్

- November 02, 2023 , by Maagulf
యూఏఈలో నాన్-రెసిడెంట్స్ కోసం కొత్త టాక్స్ రూల్స్

యూఏఈ: దేశంలోని కార్పొరేట్ పన్ను పరిధిలోకి వచ్చే నాన్-రెసిడెంట్‌లను నిర్ణయించేందుకు కొత్త గైడ్‌ లైన్స్ ను యూఏఈ ఫెడరల్ టాక్స్ అథారిటీ (FTA)  విడుదల చేసింది. జూన్ 1, 2023 నుండి అమలులోకి వచ్చిన కార్పొరేట్ పన్ను చట్టంలో భాగంగా ఈ మార్పులను చేసినట్లు వెల్లడించింది.  ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేసింది. FTA  అధికారిక వెబ్‌సైట్‌లో కొత్త మార్గదర్శకాలు ఉన్నాయని తెలిపింది.

FTA కొత్త గైడ్ లైన్స్ ప్రకారం.. నాన్-రెసిడెంట్ యూఏఈలో శాశ్వత సంస్థను కలిగి ఉండి మరియు సంవత్సరంలో AED1,000,000 కంటే ఎక్కువ టర్నోవర్ కలిగి ఉండేవారు, ఎమిరేట్స్ నుండి ఆదాయాన్ని పొందేవారుగా రెండు కేటగిరీలుగా నిర్ణయించారు. అదే విధంగా నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులు (కార్పొరేషన్లు) కార్పొరేట్ పన్నుకు లోబడి ఉండేందుకు నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగా ఉండాలని నిర్దేశించారు.  నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులు కార్పొరేట్ పన్ను ప్రయోజనాల కోసం నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారు సంబంధిత ప్రమాణాలకు అనుగుణంగా పన్ను నమోదు సంఖ్య (TRN)ని పొందాలి.  అయితే, ఎమియార్టెస్‌లో శాశ్వత స్థాపన లేదా అనుబంధం లేని నాన్-రెసిడెంట్ జురిడికల్ వ్యక్తులకు కార్పొరేట్ పన్ను నమోదు అవసరం లేదని FTA స్పష్టం చేసింది.కాగా, ఒక నాన్-రెసిడెంట్ నేచురల్ వ్యక్తి కార్పొరేట్ పన్ను ప్రయోజనాల కోసం నమోదు చేసుకోవాలని, యూఏఈలో వారి శాశ్వత స్థాపనకు ఆపాదించబడిన వారి టర్నోవర్ క్యాలెండర్ ఇయర్ లో AED1,000,000 మించి ఉంటే TRNని పొందాలని కొత్త గైడ్ లైన్స్ స్పష్టం చేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com