యూఏఈ ఫ్యామిలీ విజిట్ వీసా: ఖర్చులు, ఉచిత ప్రవేశ అనుమతి కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే?

- November 02, 2023 , by Maagulf
యూఏఈ ఫ్యామిలీ విజిట్ వీసా: ఖర్చులు, ఉచిత ప్రవేశ అనుమతి కోసం ఎలా దరఖాస్తు చేయాలంటే?

యూఏఈ: యూఏఈకి విహారయాత్రను ప్లాన్ చేస్తున్నారా? అయితే మీరో విషయం తెలుసుకోవాలి. పర్యాటకులు ఫ్యామిలీ విజిట్ వీసా కోసం దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఇది పిల్లలకు ఉచితంగా అందించబడుతుంది. ఈ పథకం కింద.. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు ఉచితంగా వీసా మంజూరు చేయబడుతుంది. అదే సమయంలో వారి తల్లిదండ్రులకు సాధారణ ఛార్జీలు వర్తిస్తాయి. "ఈ వీసా కోసం దరఖాస్తును తండ్రి లేదా తల్లి దరఖాస్తుతో పాటు సమర్పించాలి" అని రీగల్ టూర్స్ వరల్డ్‌వైడ్‌లో ఇన్‌బౌండ్ మరియు అవుట్‌బౌండ్ కార్యకలాపాలకు సీనియర్ మేనేజర్ సుబైర్ తెకెపురత్వాలాప్పిల్ అన్నారు.  అనేక మంది సందర్శకులు ఈ ప్రవేశ అనుమతిని ఎంచుకున్నారని నిపుణులు తెలిపారు. "ఫ్యామిలీ గ్రూప్ విజిట్ వీసా అనేది కుటుంబాలకు మరింత సౌకర్యవంతంగా, తక్కువ ఖర్చుతో కూడుకున్నది. 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వీసా రుసుము ఉండదు." అని సుబైర్ చెప్పారు. దరఖాస్తు చేసుకోగల పిల్లల సంఖ్యపై ఎటువంటి పరిమితులు లేవని పేర్కొన్నారు. కేవలం ఒక పేరెంట్‌తో ప్రయాణించే పిల్లలకు కూడా ఉచిత వీసా వర్తిస్తుందని ఆయన వివరించారు. ఇది 30- లేదా 60-రోజుల రెసిడెన్సీ కోసం అందుబాటులో ఉందని, దీనిని యూఏఈలో పొడిగించుకోవచ్చన్నారు. పండుగల సీజన్ దగ్గర పడుతున్నందున, ప్రతిరోజూ అనేక కుటుంబ విజిట్ వీసాలు జారీ చేయబడుతున్నాయని, ముఖ్యంగా దుబాయ్‌లో దీపావళి జరుపుకోవాలనుకునే భారతీయులకు ఇది ఎంతో సౌకర్యంగా ఉంటుందని  తాహిరా టూర్స్ అండ్ ట్రావెల్స్ వ్యవస్థాపకుడు ఫిరోజ్ మలియక్కల్ అన్నారు.

ఎలా దరఖాస్తు చేయాలంటే?

ఒక కుటుంబం వారి పాస్‌పోర్ట్‌లు,  ఫోటోల కాపీలను - అన్నీ ఒకేసారి - ట్రావెల్ ఏజెన్సీకి సమర్పించాలి. ఫీజులు చెల్లించాలి. పిల్లలకు వీసా ఉచితం అయినప్పటికీ, ట్రావెల్ ఏజెంట్ సర్వీస్ ఛార్జీలు,  బీమా రుసుములు వర్తిస్తాయని గమనించాలి. ఆ తర్వాత ఏజెన్సీ దరఖాస్తును ప్రాసెస్ చేస్తుంది. వీసా సాధారణంగా ఒకటి లేదా రెండు రోజుల్లో జారీ చేయబడుతుంది.

ఫీజులు

తల్లిదండ్రుల కోసం వీసా రుసుము, పిల్లలకు సర్వీస్ ఛార్జీతో పాటు, ప్రయాణ ఏజెన్సీని బట్టి మారవచ్చు. తల్లిదండ్రులకు 30 రోజుల వీసా 350 నుండి 500 Dh500 వరకు ఉంటుంది. పిల్లల కోసం సర్వీస్ ఛార్జీ మరియు బీమా 80 మరియు Dh120 మధ్య ఉంటుంది. 60 రోజుల వీసా ధర 500 నుండి Dh650 వరకు ఉంటుంది. అయితే బీమాతో సహా సేవా ఛార్జీ Dh130 నుండి Dh170 వరకు మారవచ్చు.

ఏమేమీ కావాలంటే?

పాస్పోర్ట్ కాపీ, పాస్‌పోర్ట్ సైజు ఫోటో అవసరం అవుతాయి. యూఏఈ నుండి నిష్క్రమించకుండానే కుటుంబ వీసాను పొడిగించవచ్చని ట్రావెల్ ఏజెన్సీలు చెప్పాయి.  సందర్శకులు దేశం నుండి నిష్క్రమించకుండానే కుటుంబ వీసాను 120 రోజుల వరకు పొడిగించుకునే అవకాశం ఉంది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com