యూఏఈ ఉదారత: 1,000 మంది పాలస్తీనియన్ పిల్లలకు చికిత్స
- November 02, 2023
యూఏఈ: గాజా నుండి విదేశీయుల తరలింపు, గాయపడిన పౌరుల కోసం ఈజిప్ట్ రఫా క్రాసింగ్ తెరిచింది. దీంతో వైద్య చికిత్స కోసం 1000 మంది పాలస్తీనియన్ పిల్లలను యూఏఈకి తీసుకురానున్నట్లు యూఏఈ ప్రభుత్వం ప్రకటించింది. అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. విదేశీ వ్యవహారాల మంత్రి షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ అల్ నహ్యాన్, ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ రెడ్ క్రాస్ (ICRC) ప్రెసిడెంట్ మిర్జానా స్పోల్జారిక్ ఫోన్ కాల్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఈ ప్రకటన వెలువడింది. ఈ సందర్భంగా వారు గాజాలోని పౌరులకు సురక్షితమైన, నిరంతరాయంగా వైద్య సహాయం అందించడంపై చర్చించారు.
తాజా వార్తలు
- ప్రధాని మోదీకి ‘ఆర్డర్ ఆఫ్ ఒమన్’ పురస్కారం
- 40 మంది సభ్యులతో గవర్నర్ను కలవనున్న జగన్
- మిసెస్ ఎర్త్ ఇంటర్నేషనల్-2025గా విద్యా సంపత్
- న్యాయ వ్యవస్థలో ఓ దురదృష్టకరమైన ట్రెండ్ నడుస్తోంది: చీఫ్ జస్టిస్ సూర్యకాంత్
- కొత్త ఏఐ ఫీచర్.. వాయిస్ మెసేజ్లు ఇక టెక్ట్స్లో!
- వచ్చే ఏడాది అక్టోబర్ వరకు హెచ్-1బీ వీసా వాయిదా
- ఖతార్ అర్దాలో ఆకట్టుకున్న అమీర్..!!
- భారత్-సౌదీ మధ్య పరస్పర వీసా మినహాయింపు..!!
- యూఏఈలో భారీ వర్షాలు, వడగళ్లతో బీభత్సం..!!
- ముబారక్ అల్-కబీర్లో వాహనాలు స్వాధీనం..!!







