'సలార్’ సందడి‌కి తెర లేపేదెప్పుడు ప్రశాంత్ నీల్.?

- November 02, 2023 , by Maagulf
\'సలార్’ సందడి‌కి తెర లేపేదెప్పుడు ప్రశాంత్ నీల్.?

‘కేజీఎఫ్’ సినిమాతో సెన్సేషనల్ డైరెక్టర్ అనిపించుకున్న ప్రశాంత్ నీల్ తాజాగా ‘సలార్’ చిత్రం తెరకెక్కిస్తున్నాడు. ప్యాన్ ఇండియా స్టార్ అయిన ప్రబాస్‌తో ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సలార్’ కావడంతో అంచనాలు భారీగా వున్నాయ్ ఈ సినిమా మీద.

వాయిదాల పర్వం తర్వాత ఈ సినిమా ఎట్టకేలకు డిశంబర్‌లో రిలీజ్‌కి ముస్తాబవుతోంది. అయితే, ఇంతవరకూ సినిమాకి సంబంధించి ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చేలా రావల్సిన టీజర్లు కానీ, ట్రైలర్లు కానీ రాలేదింతవరకూ.

ఫ్యాన్స్ కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నారు. అయితే, త్వరలోనే ఓ అదిరిపోయే టీజర్‌కి ప్లాన్ చేస్తున్నామని చిత్ర యూనిట్ చెప్పుకొస్తోంది.

ఇదిలా వుంటే, ‘సలార్’ రెండు పార్టులుగా రిలీజ్ అవుతుందని ప్రచారం జరిగిందింతవరకూ. కానీ, అంత సీను లేదనీ, రెండో పార్ట్‌ని కూడా మొదటి పార్ట్‌లోనే కలిపేసి ఒక్కటిగా రిలీజ్ చేయాలని అనుకుంటున్నారట. దాంతో సినిమాపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయ్.

సినిమా అవుట్ పుట్ ఎలా వచ్చింది.? ఐటెం సాంగ్స్ గట్రా వున్నాయా.? యాక్షన్ బ్లాక్స్ ఏ రేంజ్‌లో వుంటాయ్.? తదితర పలు రకాల ప్రశ్నలు ‘సలార్’పై. తాజాగా మరో 50 రోజుల్లో సినిమా రిలీజ్ అవుతుంది.. అంటూ ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేసింది ‘సలార్’ టీమ్.!

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com