గాజాపై అణుబాంబు హెచ్చరికలు..తీవ్రంగా ఖండించి యూఏఈ
- November 06, 2023
యూఏఈ: గాజా స్ట్రిప్‌పై అణుబాంబు వేయడంపై ఇజ్రాయెల్ హెరిటేజ్ మంత్రి అమీహై ఎలియాహు చేసిన వివాదస్పద కామెంట్స్ ను యూఏఈ తీవ్రంగా ఖండించింది. ఈ ప్రకటనలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమే కాకుండా యుద్ధ నేరాల వంటి అంతర్జాతీయ మానవతా చట్టాన్ని తీవ్రంగా ఉల్లంఘించేలా ప్రేరేపిస్తాయని, మారణహోమం చేయాలనే ఉద్దేశ్యంతో తీవ్ర ఆందోళనలను రేకెత్తిస్తాయని ఒక ప్రకటనలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (MoFA) ఆందోళన వ్యక్తం చేసింది. పౌరుల ప్రాణాలను కాపాడడం, వారికి అవసరమైన మానవతా సహాయం అందించడం తక్షణ ప్రాధాన్యత అని యూఏఈ స్పష్టం చేసింది. మరింత ప్రాణనష్టాన్ని నివారించడానికి తక్షణ కాల్పుల విరమణ అవసరాన్ని మంత్రిత్వ శాఖ పునరుద్ఘాటించింది. ఆక్రమిత పాలస్తీనా భూభాగంలో పరిస్థితికి మరింత ఆజ్యం పోయడాన్ని నివారించడానికి ప్రయత్నాలను ముమ్మరం చేయాలని యూఏఈ అంతర్జాతీయ సమాజానికి పిలుపునిచ్చింది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..