యూఏఈ మరో వారంపాటు వర్షాలు

- November 06, 2023 , by Maagulf
యూఏఈ మరో వారంపాటు వర్షాలు

యూఏఈ: ఉపరితల అల్పపీడనం కారణంగా రాబోయే వారం రోజులపాటు మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉందని జాతీయ వాతావరణ కేంద్రం (NCM) ఫ్లాట్‌ఫారమ్ X(ట్విటర్)లో ప్రకటించింది. ముఖ్యంగా తూర్పు, ఉత్తర ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందన్నారు. ఈ సందర్భంగా పర్వతాల మీదుగా ప్రవహిస్తున్న జలపాతాలకు సంబంధించిన వీడియోలు షేర్ చేసింది. ఆదివారం పలు ప్రాంతాల్లో వివిధ తీవ్రతలతో కూడిన వర్షపాతం నమోదైందని పేర్కొంది.  ఫుజైరాలో తీవ్రమైన వర్షపాతం,  వరదలను చూపించే వీడియోలను స్టార్మ్ సెంటర్ సోషల్ మీడియాను పోస్ట్ చేసింది.  వర్షాల సమయంలో లోతట్టు ప్రాంతాలు, లోయలలోకి వెళ్లవద్దని సంఘం సభ్యులను హెచ్చరించింది. ముఖ్యంగా వరద పీడిత ప్రాంతాలకు దూరంగా ఉండాలని ప్రజలకు సూచించారు. తీర, ఉత్తర మరియు తూర్పు ప్రాంతాలలో కనీసం రాత్రి 8.30 గంటల వరకు వర్షపాతం కొనసాగుతుందని హెచ్చరించింది. 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com