200,000 సంవత్సరాల నాటి చేతి గొడ్డలి వెలికితీత
- November 06, 2023
అల్ ఉలా: అల్ ఉలా గవర్నరేట్‌లోని ఖుర్హ్ సైట్‌లో 200,000 సంవత్సరాల క్రితం నాటి పురాతన శిలాయుగానికి చెందిన చేతి గొడ్డలిని వెలికితీసినట్లు రాయల్ కమిషన్ ఫర్ అల్ ఉలా (RCU) వెల్లడించింది. మృదువైన బసాల్ట్ రాయితో రూపొందించబడినదని, 51.3 సెం.మీ పొడవుతో ఇది ఉందన్నారు. ఖుర్, ప్రారంభ ఇస్లామిక్ కాలాల నుండి చారిత్రక ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం అని, అరేబియా ద్వీపకల్పం కీలకమైన పట్టణ ప్రాంతాలలో ఒకటిగా ఉందని పేర్కొంది. ఈ పురాతన సాధనాన్ని హెరిటేజ్ కన్సల్టెన్సీ అధికారులు.. పురావస్తు శాస్త్రజ్ఞుల బృందానికి అప్పగించారు. అల్ ఉలాకు దక్షిణంగా ఉన్న ఖుర్హ్ పరిసర ప్రాంతాన్ని అన్వేషించే పనిలో భాగంగా ఈ బృందం గతంలో ఇస్లామిక్ కాలం నుండి అనేక పురావస్తు పరిశోధనలను వెలికితీసింది. RCU ప్రస్తుతం అల్ ఉలా మరియు ఖైబర్‌లలో 11 ప్రత్యేక పురావస్తు ప్రాజెక్టులను పర్యవేక్షిస్తుంది.
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..