‘ఈగల్’ టీజర్ టాక్.! మాస్ రాజా రవితేజ నట విశ్వరూపం.!

- November 06, 2023 , by Maagulf
‘ఈగల్’ టీజర్ టాక్.! మాస్ రాజా రవితేజ నట విశ్వరూపం.!

‘కనిపించడు.. వినిపించడు.. కానీ, వ్యాపించి వుంటాడు..’ మనిషా.. మిథ్యా.? విధ్వంసం.. విశ్వరూపం.. అంటూ భారీ డైలాగులతో హీరో పాత్రకు బీభత్సమైన ఎలివేషన్ ఇస్తూ క్యారెక్టర్ రివీల్ చేశారు. ఇదంతా మాస్ రాజా రవితేజ నటిస్తున్న ‘ఈగల్’ సినిమాకి సంబంధించింది.
జనవరి 13న ‘ఈగల్’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు మాస్ రాజా రవితేజ. ఇటీవలే ‘టైగర్ నాగేశ్వరరావు’తో ప్యాన్ ఇండియా అంటూ వాతలు పెట్టించుకున్నాడు. ఇప్పుడు ‘ఈగల్’ అంటున్నాడు. కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా టీజర్ లేటెస్ట్‌గా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.
టీజర్‌లో ఎలివేషన్ అయితే బాగుంది. అనుపమా పరమేశ్వరన్, అవసరాల శ్రీనివాస్, మధుబాల, నవదీప్.. ఇలా చాలా మంది తారాగణం కీలకంగా కనిపిస్తున్నారు. ఆయా క్యారెక్టర్లతో హీరో క్యారెక్టర్ డెప్త్‌ని వివరించే ప్రయత్నం చేశారు. టీజర్ చివర్లో గన్నులు పట్టుకుని మాస్ రాజా పక్కా మాస్ గెటప్‌లో లుంగీ ఎగ్గట్టి పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు.
ఈ ఎంట్రీకి మాస్ రాజా ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. మరి, సినిమా హిట్ అయితేనే కదా.. అసలు కథ. హిట్టయితే, అసలు సిసలు పండగ చేసుకుంటారు. మొండోడు పండగని తీసుకుని ముందే వస్తున్నాడు.. అంటూ టీజర్‌ లాంఛింగ్‌కి ఇంట్రో ఇచ్చారు. నిజంగానే ఫ్యాన్స్‌కి మాస్ రాజా పండగ తీసుకొస్తాడా.? లెట్స్ వెయిట్ అండ్ సీ.!

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com