సుమ కనకాల వారసుడు తక్కువోడేం కాదండోయ్.!
- November 06, 2023
యాంకర్ సుమకు ఏ రేంజ్‌లో ఫాలోయింగ్ వుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అలాగే రాజీవ్ కనకాల ఫ్యామిలీకీ కూడా ఇండస్ర్టీలో మంచి పేరుంది. మంచి నటుడిగా రాజీవ్ కనకాల తెలుగు ప్రేక్షకులందరికీ సుపరిచితుడే. ఇప్పుడాయన వారసుడు రోహన్ కనకాల హీరోగా డెబ్యూ చేస్తున్నాడు.
ఆ సినిమా పేరే ‘బబుల్ గమ్’. మానస అనే కొత్తమ్మాయి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. త్వరలో ‘బబుల్‌గమ్’ ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు ముస్తాబవుతోంది. కాగా, ‘బబుల్ గమ్’ అనే కొత్త టైటిల్‌తో వస్తున్న ఈ సినిమాని బాగా ప్రమోట్ చేస్తున్నారు.
లేటెస్ట్‌గా రిలీజైన ‘హబీబీ.. జిలేబీ’ అనే సాంగ్ వీడియోతో రోహన్ కనకాల ట్రెండింగ్ అయిపోయాడు. ఈ పాట లిరిక్స్ కానీ, పాట కొరియోగ్రఫీ.. రోహన్ డాన్సులు.. హీరోయిన్ క్యూట్ అప్పీల్.. అన్నీ బాగా సెట్ అయ్యాయ్.
దాంతో, సోషల్ మీడియాని ఊపు ఊపేస్తోంది ఈ సాంగ్. ఇక, ఈ సాంగ్ వీడియోలో రోహన్ కాన్ఫిడెన్స్ చూస్తుంటే.. కెవ్వు కేక.! అసలు తొలి సినిమా అన్న బెరుకే కనిపించడం లేదు. ఎంతైనా కనకాల ఫ్యామిలీ. అందులోనూ సుమకు ముద్దుల తనయుడాయె.
అన్నట్లు వెరీ లేటెస్ట్‌గా జరిగిన వరుణ్ - లావణ్య రిసెప్షన్ వేడుకలోనూ రోహన్ కనకాల తల్లి సుమ కనకాలతో కలిసి సందడి చేశాడు. కెమెరా ప్రెజెన్స్ తనపై వుండేలా చూసుకుంటున్నాడు మనోడు ఎక్కడున్నా సరే. ఫస్ట్ సాంగ్‌తో బాగానే ఎట్రాక్ట్ చేశాడు. బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఎలాగూ వుంది. ఇక, సినిమా హిట్ అయితే మనోడికి ఇండస్ర్టీలో మంచి భవిష్యత్తున్నట్లే.!
తాజా వార్తలు
- మహిళల హకీ ఆసియా కప్‌లో ఫైనల్‌కు భారత్
- జెడ్డాలో ప్రారంభమైన జ్యువెలరీ ఎక్స్పోజిషన్..!!
- కువైట్ లో భారత రాయబారిగా పరమితా త్రిపాఠి..!!
- కార్మికుడికి Dh1.5 మిలియన్ల పరిహారం..!!
- ప్రాంతీయ పరిణామాలపై యూఎన్ సెక్రటరీ జనరల్ ఆరా..!!
- అమెరికా వైస్ ప్రెసిడెంట్ తో ఖతార్ పీఎం సమావేశం..!!
- పోలీసుల అదుపులో పలువురు మోటార్ సైక్లిస్టులు..!!
- బీసీసీఐ అధ్యక్షుడి రేస్ లో ప్రముఖ క్రికెటర్ లు?
- ఒమన్ పై పాక్ విజయం..
- భారత దేశం మొత్తం టపాసులు బ్యాన్..