‘జిగర్తాండ డబుల్ ఎక్స్.‘! లారెన్స్ అండ్ సూర్య పర్పామెన్స్ వేరే లెవల్.!
- November 07, 2023
కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్తాండ’ సినిమా తమిళంలో మంచి విజయం అందుకున్న సంగతి తెలిసిందే. ఆ సినిమాని తెలుగులో ‘గద్దలకొండ గణేష్’ పేరుతో తెలుగులో రీమేక్ అయ్యి మంచి విజయం సాధించింది.
అదే సినిమాకి సీక్వెల్గా రూపొందుతోన్న సినిమానే ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’. అయితే, ఈ సినిమాని ఇప్పుడు భారీ బడ్జెట్తో ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కించారు.
దాంతో అంచనాలు పెరిగాయ్. తమిళంతో పాటూ, తెలుగు తదితర భాషల్లో గ్రాండ్గా రిలీజ్ చేస్తున్నారు. లారెన్స్, ఎస్.జె సూర్య ప్రధాన తారాగణంగా ఈ సినిమాలో నటించడం మరో హైలైట్.
మొదటి పార్ట్ తరహాలోనే ఓ గ్యాంగ్ స్టర్కీ, డైరెక్టర్కీ మధ్య నడిచే కథా నేపథ్యంలోనే ఈ సీక్వెల్ కూడా వుండబోతోంది. కానీ, నిర్మాణాత్మకంగా చాలా చాలా ఉన్నతంగా వుండబోతోందట. ప్రమోషన్లు కూడా గట్టిగా చేస్తున్నారు. దాదాపు 100 కోట్ల బడ్జెట్ మూవీ అని చెబుతున్నారు.
ఇటీవలే లారెన్స్ రాఘవ ‘చంద్రముఖి 2’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించాడు. ఆశించిన విజయం అందుకోలేకపోయాడు. కానీ, ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’కి ఎస్.జె.సూర్య అదనంగా యాడ్ అవ్వడంతో అంచనాలు బాగున్నాయ్. ఆల్రెడీ ‘స్పైడర్’ తదితర సినిమాలతో సూర్య పర్పామెన్స్ లెవల్స్ తెలుగు ఆడియన్స్కీ సుపరిచితమే కదా.!
తాజా వార్తలు
- ప్రధాని మోదీ జన్మదిన వేడుకల్లో రక్తదాన మహోత్సవం
- ప్రభుత్వ సలహాదారుగా NVS రెడ్డి
- నేడు లండన్లో మంత్రి నారా లోకేశ్ నేతృత్వంలో రోడ్ షో
- సౌదీ అరేబియాలో భారీగా మాదకద్రవ్య పిల్స్ సీజ్..!!
- సమాహీజ్ ఇంట్లో అగ్నిప్రమాదం..ఒకరు మృతి..!!
- దుబాయ్ లో టెనంట్స్ కు బంపర్ డీల్స్..!!
- సోషల్ మీడియా ద్వారా ట్రాఫిక్ ఉల్లంఘనల పర్యవేక్షణ.!.!
- వాహనాల నుండి వస్తువుల చోరీ.. వ్యక్తి అరెస్టు..!!
- ఖతార్ కు సంఘీభావంగా నిలిచిన అరబ్-ఇస్లామిక్ దేశాలు..!!
- శ్రీవారి బ్రహ్మోత్సవాల బుక్లెట్ విడుదల