షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చా.?

- November 07, 2023 , by Maagulf
షుగర్ వ్యాధిని ముందుగానే గుర్తించొచ్చా.?

ఒకప్పుడు డయాబెటిస్ అంటే జీన్స్ కారణంగానే ఎటాక్ అవుతుందన్న ముప్పు వుండేది. కానీ, అది కరోనాకి ముందు. కరోనా తర్వాత పరిస్థితులు మారిపోయాయ్. కోవిడ్ సంబంధిత మెడిసెన్స్ తీసుకున్న వారిలో.. వ్యాక్సిన్ కారణంగా షుగర్ వ్యాధి ముప్పు అందరికీ వుందని కొన్ని అధ్యయనాలలో తేలింది.

కోవిడ్ తర్వాత చాలా మంది ఆ ప్రూఫ్ నిర్ధారణయ్యింది కూడా. అయితే, బ్లడ్‌లో షుగర్ లెవల్స్ ఎంత వుంటే డయాబెటిస్ సోకినట్లు అనే విషయాన్ని తెలుసుకోవాలని చాలా మందిలో కుతూహలం వుందిప్పుడు.

అలాగే కొన్ని ముందస్తు సంకేతాలూ, సూచనల ద్వారా కూడా షుగర్ వ్యాధి తగిలినట్లు నిర్ధారించుకోవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. షుగర్ టెస్ట్ చేయించకుండానే కొన్ని సూచనల ద్వారా షుగర్ వ్యాధిని గుర్తించొచ్చట.

అవేంటో తెలుసుకుందాం...

* కొందరిలో విపరీతంగా జుట్టు రాలిపోవడం షుగర్ ఎటాక్ అవుతోందన్న అలెర్ట్‌కి సూచనగా చెబుతున్నారు.
* అలాగే తరచూ అధికంగా మూత్ర విసర్జన అవుతుంటుంది. అది కూడా షుగర్‌ వ్యాధికి సూచనగా చెబుతున్నారు.
* కొందరిలో చర్మంపై ఎర్రగా మచ్చలు ఏర్పడతాయ్. ఏ పని చేసినా చేయకపోయినా తీవ్రమైన అలసట వేధిస్తుంది. ఈ కారణాలు కూడా షుగర్ వ్యాధికి సూచనలుగా చెబుతున్నారు.

ఆయా లక్షణాలను ప్రీ డయాబెటిక్ లక్షణాలుగా పరిగణిస్తున్నారు. ఈ దశను ముందుగానే గుర్తించి వైద్య సలహా తీసుకుంటే షుగర్ వ్యాధిని నియంత్రణలో పెట్టుకోవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com