లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 టికెట్ల విక్రయాలు ప్రారంభం..
- November 07, 2023
లెజెండ్స్ లీగ్ క్రికెట్ 2023 కోసం క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నవంబర్ 18 నుంచి డిసెంబర్ 9 వరకు భారత దేశంలోని ఐదు నగరాల్లో ఈ లీగ్ జరగనుంది. ఈ మ్యాచులకు సంబంధించిన టికెట్ల విక్రయాలు ప్రారంభమయ్యాయి. పేటీఎం, పేటీఎం ఇన్సైడర్‌లో టికెట్లను కొనుగోలు చేయవచ్చని లెజెండ్స్ లీగ్ క్రికెట్ (LLC) ఓ ప్రకటనలో తెలిపింది.
లెజెండ్స్ లీగ్ క్రికెట్ CEO రామన్ రహేజా మాట్లాడుతూ.. భారతదేశంలోని ఐదు నగరాల్లో మ్యాచ్‌లు జరుగుతాయన్నారు. వైజాగ్, డెహ్రాడూన్, రాంచీ, జమ్మూ, సూరత్‌లలో మ్యాచ్‌లను షెడ్యూల్ చేసినట్లు వెల్లడించారు. ఈ సీజన్ అభిమానులను మరింతగా ఆకట్టుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు.
పేటీఎం ఇన్సైడర్ బిజినెస్ హెడ్ వరుణ్ ఖరే మాట్లాడుతూ.. గౌతమ్ గంభీర్, సురేష్ రైనా, హర్భజన్ సింగ్, ఆరోన్ ఫించ్, ఇర్ఫాన్ పఠాన్, పార్థివ్ పటేల్, క్రిస్ గేల్, మార్టిన్ గుప్తిల్ వంటి క్రికెట్ దిగ్గజాల ఆటను ఈ టోర్నీ ద్వారా మరోసారి చూడొచ్చునని చెప్పారు. ఈ ఎడిషన్‌లో రెండు కొత్త ఫ్రాంచైజీలు సదరన్ సూపర్ స్టార్స్, అర్బన్రైజర్స్ హైదరాబాద్ వచ్చాయన్నారు. కొత్త జట్లతో కలిసి ఈ ఏడాది ఆరు జట్లు ఈ సీజన్‌లో ఆడతాయన్నారు. 22 రోజుల పాటు ఈ టోర్నీ అభిమానులను అలరిస్తుందని, మొత్తం 19 మ్యాచులు జరగనున్నాయన్నారు.
ఇక వైజాగ్‌లో డిసెంబర్ 2 నుండి డిసెంబర్ 4 వరకు మూడు మ్యాచులు జరగనున్నాయి. వైజాగ్‌లో జరిగే మ్యాచులు అన్ని Y.S.రాజశేఖర్ రెడ్డి ACA-VDCA అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరుగుతాయి. మ్యాచ్ టికెట్ల ధర రూ.299 నుండి ప్రారంభమవుతుంది.
తాజా వార్తలు
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!
- బహ్రెయిన్ లో కుటుంబ వ్యవస్థ బలోపేతం..!!
- బహ్రెయిన్, కువైట్ నుంచి క్యారీఫోర్ ఔట్.. త్వరలో యూఏఈ?
- రిమైండర్..ఎయిర్ పోర్టుల్లో క్యాష్, గోల్డ్ వెల్లడిపై రూల్స్..!!
- గాజాలో ఇజ్రాయెల్ నేరాలపై UN నివేదికను స్వాగతించిన సౌదీ అరేబియా..!!
- రికార్డులతో ఖరీఫ్ సీజన్‌ను ముగించిన ఒమన్ ఎయిర్..!!
- క్రీడల ద్వారా ఏపీ పర్యాటకానికి ప్రచారం: ఏపీటీడీసీ ఎండీ ఆమ్రపాలి