‘గుంటూరు కారం’.! అంత ఆషామాషీ కాదు మహేష్‌తో బేరం.!

- November 08, 2023 , by Maagulf
‘గుంటూరు కారం’.! అంత ఆషామాషీ కాదు మహేష్‌తో బేరం.!

‘సర్రుమండుతాది బాబు గొడ్డు కారం, గిర్రు తిరుగుతాది ఈడి తోటి బేరం..’ అంటూ ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేశారు ‘గుంటూరు కారం’ సినిమా నుంచి. సూపర్ స్టార్ మహేష్ బాబు - మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీగా హైప్ వుంది.

తాజాగా రిలీజ్ చేసిన ఫస్ట్ సింగిల్‌లో హీరో క్యారెక్టరైజేషన్‌కి సంబంధించిన స్ర్టెంత్‌ని పరిచయం చేశారు. లిరిక్స్‌లో కొన్ని పవర్ ఫుల్ పదాలను వాడి, హీరో క్యారెక్టర్‌ని ఎలివేట్ చేసి చెప్పే ప్రయత్నం చేశారు. బ్యాక్ ‌గ్రౌండ్‌లోని మిర్చి ఘాటు డైరెక్ట్‌గా ముక్కుకు తాకిన ఫీలింగ్ కలుగుతోంది ఈ లీరికల్ వీడియో చూస్తుంటే.

రామ జోగయ్య శాస్ర్తి రాసిన ఈ పాటకు థమన్ మ్యూజిక్ అందించాడు.  సూపర్ స్టార్ మహేష్ ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది ఈ లిరికల్ వీడియోకి. కాగా, సినిమాని సంక్రాంతికి (జనవరి 12)కి భారీ ఎత్తున రిలీజ్ చేయనున్నారు.

శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. రమ్యకృష్ణ, జయరామ్ ఇంపార్టెంట్ పాత్రల్లో కనిపించబోతున్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com