ఇండియన్ ఎంబసీ అధ్వర్యంలో ప్రవాసి పరిచై-2023..

- November 08, 2023 , by Maagulf
ఇండియన్ ఎంబసీ అధ్వర్యంలో ప్రవాసి పరిచై-2023..

రియాద్: సౌదీ అరేబియాలో ఇండియన్ ఎంబసీ నవంబర్ 4న ప్రవాసి పరిచై - 2023 కార్యక్రమాన్ని నిర్వహించచింది. ఇందులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని భాగస్వామ్యము చేసారు. ఇందుకుగాను ఇండియన్ అంబాసిడర్ డాక్టర్ సుహేల్ అజాజ్ ఖాన్, DCM అబు మాథెన్ జార్జ్, సెకండ్ సెక్రటరీ మోయిన్ అక్తర్, ఒడిశా కో-ఆర్డినేటర్ దేబాషిస్, సరోజ్ కుమార్ పాణిగ్రాహి, గుజరాత్ కోఆర్డినేటర్ త్రిలోచన్ సైనీ, ఆల్ ఇండియా స్టీరింగ్ కమిటీ కన్వీనర్ మొహమ్మద్ జిఘమ్ ఖాన్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్, APNRTS రీజినల్ కోఆర్డినేటర్ & వైస్సార్సీపీ సౌదీఅరేబియా కన్వీనర్ రెవెల్ ఆంథోనీ అబెల్ లకు ఆంధ్రప్రదేశ్ ప్రజల తరుపున తెలుగు కళాక్షేత్రము(TKK), TASA( Telugu Association of Saudi Arabia) సభ్యుల తరుపున తిరుపతి స్వామి స్వర్ణ (స్వామి), భాస్కర్ గంధవల్లి, నటరాజకుమార్ బూమిని, మురారి తాటికాయల, రవి మేడూరి, ప్రసాద్ ఓరుగంటి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు. 
ముందుగా ఈ కార్యక్రమాన్ని ఇండియన్ అంబాసిడర్ సుహేల్ అజాజ్ ఖాన్, గుజరాత్, ఒడిశా మరియు ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్లు జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించారు. అనంతరం భారత ప్రధానమంత్రి శ్నరేంద్రమోడీ రాసిన "Maadi" అనే గీతాన్ని గుజరాత్ కళాకారులు ఆలపించారు. ఈ సందర్భంగా గుజరాత్ లోని ప్రముఖ స్వతంత్రసమరయోధులు, ప్రముఖుల గురించి వివరిస్తూ సాగిన గర్భ, దాండియా నృత్యాలు వీక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఒడిశా శాస్త్రీయ నృత్యాలు, సంబల్పూరి ఫోక్ డాన్సులు, ఒడిశా రాష్ట్రములోని ప్రముఖ దేవాలయాలు, ప్రాచీన కట్టడాలు మరియు టూరిస్ట్ ప్రదేశాల గురించిన వీడియోను ప్రదర్శించారు. అలాగే "ఒడిశా రసమలై" అనే తీపి పదార్ధము ప్రతి ఒక్కరు ఎంతో ఇష్టముగా తిన్నారు.
చివరిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రములోని ఒక్కో జిల్లా ప్రాముఖ్యతను వివరిస్తూ.. ఆంధ్ర రాష్ట్ర స్వాతంత్ర సమరయోధుల మరియు ఆంధ్ర రాష్ట్ర ప్రముఖుల గురించి వీడియో రూపంలో ప్రదర్శించారు. ఈ కార్యక్రమములో ఆంధ్ర రాష్ట్ర సంస్కృతిని ప్రతిబంబించేలా ప్రదర్శించిన కోలాటం, గిరిజన తండా నృత్యాలు, సంక్రాంతి పండుగకు సంబందించిన నృత్యాలు, కళలకు సంబంధించి కొండపల్లి బొమ్మ మరియు మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలు సభికులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. 

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com