ఆసియా క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది..

- November 08, 2023 , by Maagulf
ఆసియా క‌ప్ షెడ్యూల్ వ‌చ్చేసింది..

దుబాయ్: వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ ముగిసిన వెంట‌నే క్రికెట్ ప్రేమికులను మ‌రో ఐసీసీ ఈవెంట్ ప‌ల‌క‌రించ‌నుంది. అదే అండ‌ర్‌-19 పురుషుల ఆసియాక‌ప్. ఈ టోర్నీ దుబాయ్ వేదిక‌గా జ‌ర‌గ‌నుంది. డిసెంబ‌ర్ 8 నుంచి 17 వ‌ర‌కు టోర్నీని నిర్వ‌హిస్తున్నారు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్‌ విడుద‌లైంది. ఈ టోర్న‌మెంట్‌లో మొత్తం 8 జ‌ట్లు క‌ప్పు కోసం పోటీ ప‌డ‌నున్నాయి. ఈ ఎనిమిది జ‌ట్ల‌ను రెండు గ్రూపులుగా విభ‌జించారు.

గ్రూప్ ఏలో భారత్, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ లు ఉండ‌గా గ్రూప్- బిలో బంగ్లాదేశ్, శ్రీలంక, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, జపాన్ ఉన్నాయి. భార‌త్ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ వ‌ర్సెస్ నేపాల్ మ్యాచుల‌తో డిసెంబ‌ర్ 8న టోర్నీ ఆరంభం కానుంది. మొత్తం తొమ్మిది రోజుల పాటు టోర్నీ జ‌ర‌గ‌నుంది. లీగ్ ద‌శ‌లో మ్యాచులు అన్నీ ఐసీసీ అకాడ‌మీలో జ‌ర‌గ‌నున్నాయి. సెమీఫైన‌ల్‌, ఫైన‌ల్ మ్యాచులకు దుబాయ్ అంత‌ర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదిక కానుంది. ఇక చిర‌కాల ప్ర‌త్య‌ర్థులు భార‌త్, పాకిస్థాన్ జ‌ట్లు డిసెంబ‌ర్ 10న త‌ల‌ప‌డ‌నున్నాయి.

షెడ్యూల్ ఇదే..

డిసెంబ‌ర్ 8న – భార‌త్ వ‌ర్సెస్ అఫ్గానిస్థాన్‌, పాకిస్థాన్ వ‌ర్సెస్ నేపాల్
డిసెంబ‌ర్ 9న – బంగ్లాదేశ్ వ‌ర్సెస్ యూఏఈ, శ్రీలంక వ‌ర్సెస్ జపాన్
డిసెంబ‌ర్ 10న – భారత్ వ‌ర్సెస్ పాకిస్తాన్, అఫ్గానిస్తాన్ వ‌ర్సెస్ నేపాల్
డిసెంబ‌ర్ 11న – శ్రీలంక వ‌ర్సెస్ యూఏఈ, బంగ్లాదేశ్ వ‌ర్సెస్ జపాన్
డిసెంబ‌ర్ 12న – పాకిస్తాన్ వ‌ర్సెస్ అఫ్గానిస్తాన్, భారత్ వ‌ర్సెస్ నేపాల్
డిసెంబ‌ర్ 13న – బంగ్లాదేశ్ వ‌ర్సెస్ శ్రీలంక, యూఏఈ వ‌ర్సెస్ జపాన్ ల మ‌ధ్య మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఈ మ్యాచులు అన్ని ఉద‌యం 9.30 గంట‌ల‌కు ప్రారంభం కానున్నాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com