మాదక ద్రవ్యాలు కొనడానికి డబ్బు కోసం తల్లి పై కొడుకు దాడి

- May 24, 2016 , by Maagulf
మాదక ద్రవ్యాలు కొనడానికి డబ్బు కోసం  తల్లి పై కొడుకు దాడి

 మనామా :బహ్రేయిన్ కు చెందిన ఓ వ్యక్తి  అక్రమ మాదక ద్రవ్యాలను కొనడానికి డబ్బు ఇవ్వాలని తన తల్లిని వేధించాడు ఆమె అందుకు  నిరాకరించడంతో కన్నతల్లినే అతి కిరాతకంగా కొట్టడంతో వృద్ధురాలైనా ఆ    మాతృమూర్తి పోలీసులను ఆశ్రయించడంతో చెడుమార్గం పట్టిన ఆ జులాయి కొడుకుని అదుపులోనికి తీసుకొన్నారు.60 ఏళ్ళ ఆ ముదసలి తల్లి  తన 29 ఏళ్ల కుమారుడి విపరీత చెస్టలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు . ఆమె అతనికి డబ్బు ఇవ్వలేనప్పుడు తన కుమారుడు తనపై  దాడి చేసి దారుణంగా కొడుతున్నాడని ఆమె పోలీస్  అధికారుల ముందు తన గోడు వెళ్ళబొసుకొన్నారు.  " తన కొడుకు డబ్బు ఇవ్వాలని నాకు ఆజ్ఞాపిస్తున్నాడని....డబ్బు ఇవ్వలేని పరిస్థితిలో  నాపై  అనేక సార్లు దాడి చేశాడని ఆరోపణ చేసింది.    నా వద్ద తగినంత  డబ్బు లేదు మరియు నా ఉద్యోగ విరమణ తర్వాత వచ్చిన  ఫించనుతో మాత్రమే నేను జీవిస్తున్నానని " ఆ వృద్ధ మహిళ  చెప్పారు. "నా కొడుకు అక్రమ మాదక ద్రవ్యాలకు ఓ బానిస అని అన్నారు. "

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com