నేడు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శన టికెట్లు విడుదల
- November 10, 2023
తిరుమల: తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి సంబంధించిన వివిధ టికెట్లను టీటీడీ ఈరోజు విడుదల చేయనుంది. నవంబరు 10న… తిరుమల వైకుంఠ ఏకాదశి ద్వార దర్శన టికెట్లు, రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లు, శ్రీవాణి ట్రస్టు టికెట్లు, వసతి గదుల కోటా విడుదల చేయనున్నారు. ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. టీటీడీ 2.25 లక్షల ప్రత్యేక దర్శన టికెట్లను అందుబాటులో ఉంచనుంది.
మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవాణి ట్రస్టు దర్శన టికెట్లు విడుదల చేయనున్నారు. రోజుకు 2 వేల టికెట్ల చొప్పున 10 రోజుల పాటు 20 వేల టికెట్లు విడుదల చేయాలని టీటీడీ నిర్ణయించింది. వసతి గదుల కోటాను రేపు సాయంత్రం 5 గంటలకు విడుదల చేయనున్నారు. ఈ వైకుంఠ ద్వార దర్శన టికెట్లు డిసెంబరు 23 నుంచి జనవరి 1 వరకు వర్తిస్తాయి.
ఈ టికెట్లను టీటీడీ అధికారిక వెబ్ సైట్ https://ttdevasthanams.ap.gov.in ద్వారా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు టీటీడీ ఓ ప్రకటనలో వెల్లడించింది.
తాజా వార్తలు
- ఏప్రిల్ 5 నుండి భారత్ కు కువైట్ ఎయిర్వేస్ సర్వీసులు..!!
- బహ్రెయిన్ గ్రాండ్ మస్జీదు.. విజిటర్స్ కు ఆధ్యాత్మిక అనుభవం..!!
- 70% పెరిగిన డీజిల్ ధర..ఆందోళనలో సూపర్మార్కెట్లు..!!
- 100,000 కంటే ఎక్కువ మందికి సామాజిక భద్రతా పింఛన్లు..!!
- సెప్టెంబర్‌కు మారిన అటానమస్ ఇ-మొబిలిటీ ఫోరమ్..!!
- 911కు మార్చి నెలలో 2.6 మిలియన్లకు పైగా కాల్స్..!!
- డిగ్రీ, పీజీ విద్యార్థులకు శుభవార్త..
- అమరావతి బిల్లు ఆమోదం..ప్రధాని మోదీని కలిసిన నారా లోకేశ్
- వరల్డ్ క్లాస్ రాజధానిగా అమరావతి: మంత్రి కొండపల్లి శ్రీనివాస్
- కేరళలో ఎస్పీబీ విగ్రహావిష్కరణ









