ఒమన్‌లో టాక్సీ సేవల పునరుద్ధరణకు డెడ్ లైన్!
- November 13, 2023
మస్కట్: సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని బహిరంగ ప్రదేశాల్లో నడుస్తున్న తెలుపు, నారింజ రంగు ట్యాక్సీలన్నీ జనవరి 1, 2024లోపు లైసెన్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలని రవాణా, కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ (MTCIT) తెలిపింది. మంత్రిత్వ శాఖ ప్రకటించిన లైసెన్స్డ్ అప్లికేషన్లో ఒమన్టాక్సీ, ఓటాక్సీ, మర్హబా, హలా మరియు తస్లీమ్ ఉన్నాయి. "అబెర్" అప్లికేషన్లో మొదటి దశలో సుల్తానేట్ ఆఫ్ ఒమన్‌లోని విమానాశ్రయాలలో పనిచేసే ట్యాక్సీలు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. నవంబర్ 1, 2023న ప్రారంభమయ్యే రెండవ దశలో హోటల్లు, వాణిజ్య కేంద్రాలు మరియు ఓడరేవులలో పనిచేసే టాక్సీలు.. మూడవ దశ జనవరి 1, 2024 నుండి ప్రారంభమవుతుంది. ఇందులో బహిరంగ ప్రదేశాల్లో పనిచేసే అన్ని తెలుపు, నారింజ రంగు ట్యాక్సీలను లక్ష్యంగా చేసుకుంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్‌లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!
- ప్రయాణికులకు సౌదియా గుడ్ న్యూస్..!!
- అబుదాబిలో ఫుల్ కోహ్లీ రెస్టారెంట్ మూసివేత..!!
- బహ్రెయిన్ జైళ్ల శాఖలో సంస్కరణలు..!!
- సముద్రయానంలో ఖతార్ పురోగతి..Q1లో రికార్డు..!!
- నోట్ల కట్టల వివాదం..అలహాబాద్ హైకోర్టు జడ్జి రాజీనామా
- ఏపీ ప్రజలకు అలర్ట్..ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు..
- రూ.10 వేలు దాటితే గంట వెయిటింగ్..డిజిటల్ మోసాలకు ఆర్బీఐ ‘చెక్’!









