సందర్శకులను ఆకట్టుకుంటున్న దుబాయ్ ఎయిర్‌షో

- November 14, 2023 , by Maagulf
సందర్శకులను ఆకట్టుకుంటున్న దుబాయ్ ఎయిర్‌షో

యూఏఈ: దుబాయ్ ఎయిర్‌షో 2023లో సోమవారం దుబాయ్ వరల్డ్ సెంట్రల్ (డిడబ్ల్యుసి)లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా యూఏఈ ఏవియేషన్ పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ ఆకట్టుకునే ఫ్లైబై సామర్థ్యాలు అందరిని ఆశ్చర్యపరిచాయి.  ప్రపంచంలోనే అతిపెద్ద వాణిజ్య ప్రయాణీకుల విమానం ఐకానిక్ ఎమిరేట్స్ A380, యూఏఈ ఎయిర్ డిస్‌ప్లే టీమ్, అల్ ఫుర్సాన్ ఇందులో పాల్గొన్నాయి. ఎరుపు, ఆకుపచ్చ మరియు నలుపు స్మోక్ ట్రయల్స్‌ ప్రేక్షలను ఆకట్టుకున్నది. ఎమిరేట్స్ బోయింగ్ 777, ఎతిహాద్ ఎయిర్‌బస్ 350, ఎయిర్ అరేబియా ఎయిర్‌బస్ 320 మరియు ఫ్లైదుబాయి బోయింగ్ 737 ఆకాశంలో అద్భుతంగా దూసుకుపోయాయి. వందలాది మంది ప్రేక్షకులు ఆ క్షణాలను వారి కెమెరాలలో బంధించారు. ఎయిర్ షో నవంబర్ 17 వరకు జరుగనుంది. వైమానికి ప్రదర్శనలు దుబాయ్ వరల్డ్ సెంటర్‌లోని స్కైవ్యూ గ్రాండ్‌స్టాండ్‌లో ప్రతిరోజూ మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com