వింటర్లో ఈ పండ్లు తప్పక తినాల్సిందే.!
- November 16, 2023
చలికాలంలో ఇమ్యూనిటీ పవర్ కాస్త తక్కువగా వుంటుంది. తద్వారా అనేక రకాల జబ్బులు ఈజీగా ఎటాక్ చేస్తుంటాయ్. ముఖ్యంగా జలుబు, ఫ్లూ వంటి సమస్యలు తరచూ వేధిస్తుంటాయ్.
వాటి నుంచి తట్టుకోవాలంటే కొన్ని రకాల పండ్లను తప్పకుండా తినాలి ఈ కాలంలో. ఈ కాలంలో వచ్చే శీతాఫలంతో పాటూ, ‘సి’ విటమిన్ అధికంగా వుండే నారింజ పండును ఎక్కువగా తినాలని నిపుణులు చెబుతున్నారు.
నారింజలోని యాంటీ ఆక్సిడెంట్లు ఈ కాలంలో వచ్చే ఫ్లూ నుంచి శరీరం తట్టుకోవడానికి తగినంత ఇమ్యూనిటీ పవర్‌ని ఇస్తాయ్.. అలాగే, బొప్పాయి పండు కూడా.
చలికాలంలో చర్మం ముడుచుకుపోవడాన్ని బొప్పాయి నియంత్రిస్తుంది. శరీరానికి తగినంత తేమనందించి కాపాడుతుంది.
స్ట్రాబెర్రీలోనూ అధికంగా సి విటమిన్ వుంటుంది. అలాగే, యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా వుంటాయ్. ఈ పండును డైరెక్ట్‌గా తీసుకున్నా లేదంటే జ్యూస్ రూపంలో తీసుకున్నా కూడా ఈ కాలంలో మంచి ఫలితం వుంటుంది.
డ్రాగన్ ప్రూట్స్, ఖర్జూరం కూడా ఈ కాలంలో తినాల్సిన పండ్ల లిస్టులో చేర్చుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
తాజా వార్తలు
- ఏపీలో ₹లక్ష కోట్లతో 110 భారీ ప్రాజెక్టులు
- మోదీ ప్రభుత్వాన్ని దేశం నుంచి తొలగిస్తాం: రాహుల్ గాంధీ
- ప్రపంచ అక్షరాస్యత ర్యాంకింగ్‌లో ఖతార్ స్ట్రాంగ్..!!
- వ్యవసాయ కార్మికులకు 30 రోజుల వార్షిక సెలవులు..!!
- యూఏఈలో భారీ వర్షాలు.. ఫుడ్ డెలివరీలు ఆలస్యం..!!
- ఇండియన్ బుక్ కార్నర్‌ను ప్రారంభించిన భారత రాయబారి..!!
- 'తమ్కీన్' కార్యక్రమాన్ని ప్రారంభించనున్న OCCI..!!
- ప్రజల్లో భరోసా నింపిన బహ్రెయిన్ పోలీస్ ఫోర్స్..!!
- నిరుపేద బాలల్లో సంతోషాన్ని నింపిన NATS
- ఈనెల 16 నుంచి యాదగిరిగుట్టలో ధనుర్మాసోత్సవాలు







