కట్టె పొంగలి

- April 10, 2015 , by Maagulf

ఈ వారం మీ కోసం కట్టె పొంగలి రెసిపీ తో రెడీ గా ఉన్నాం. మామూలుగా పొంగలి అంటే కాస్త మెత్తగా వండుతాం కానీ ఈ రెసిపీ లో పొంగలి డ్రై గా చేస్తున్నాం.

కావలసిన పదార్ధాలు:

  • బియ్యం       -  1 కప్పు
  • పెసర పప్పు -  1/2 కప్పు
  • కరివేపాకు   -  గుప్పెడు
  • మిరియాలు -  1 టేబుల్ స్పూన్
  • జీడిపప్పు   -  గుప్పెడు
  • జీలకర్ర       -  1 టేబుల్ స్పూన్
  • అల్లం         -  1 ఇంచ్
  • పచ్చి మిర్చి-  3 (మీకు సరిపడా)

ముందుగా:

  • ఒక మిక్సి లో మిరియాలు, జీలకర్ర, అల్లం, పచ్చిమిర్చి వేసి పేస్టు గా చేయాలి.

చేయు విధానం:

  • బియ్యం మరియు పెసరపప్పు పైన చెప్పిన కొలతలో (1 కప్పు బియ్యానికి 2 కప్పులు నీరు పోయాలి) 3 కప్పుల నీరు పోసుకొని ప్రెషర్ కుక్కర్ లో 4 కూతలు వచ్చేదాకా వండాలి.
  • కుక్కర్ ప్రెషర్ పోయాక మూత తీసి ఉడికిన అన్నాన్ని చల్లారనివ్వండి.
  • ఇప్పుడు ఒక చిన్న బాండి లో నెయ్యి వేసి వేడి చేయాలి. ఇందులో జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి.
  • అదే నెయ్యిలో మనం ముందుగా చేసి పెట్టుకున్నపేస్టు ని, కరివేపాకు, కొద్దిగా మిరియాలు వేసి ఒక 2 నిముషాలు వేయించండి.
  • ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అన్నం లో కలపండి.
  • వేయించి పెట్టుకున్న జీడిపప్పు పైన చల్లుకొని సర్వ్ చేసుకోవటమే.

---- వి. జానకి జ్యోతి, అబు ధాబి.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com