అయుదుగురు భారతీయ కార్మికులను సజీవంగా పాతిపెట్టిన సౌదీ అరేబియా నిందితులు
- May 25, 2016
అయుదుగురు భారతీయ వ్యవసాయ కార్మికులను కర్రలతో కొట్టి సజీవంగా పాతిపెట్టిన ముగ్గురు సౌదీ అరేబియా నిందితులు నాలుగేళ్ల తర్వాత విషయం వెలుగులోనికి ....
5 గురు భారతీయ వ్యవసాయ కార్మికులను కర్రలతో దారుణంగా కొట్టి వారిని సజీవంగా భూమిలో పాతిపెట్టి వారి మరణానికి ప్రత్యక్ష కారణమైన ముగ్గురు నిందితులను దోషులుగా తేల్చి సౌదీ అరేబియా కోర్టు వారికి మరణశిక్ష విధించింది. ప్రతివాదులలో ఒకడు తమ నేరాన్ని అంగీకరిస్తూ, తాము ఏ పరిస్థితి లో 5 గురు భారతీయ వ్యవసాయ కార్మికులను హతమార్చాల్సి వచ్చిందో కోర్టుకు తెలిపాడు. వారు పని కల్పించి పోషిస్తున్న స్వంత యజమాని యొక్క చిన్న కుమార్తె పట్ల అనుచితంగా ప్రవర్తించడమే కాక ఆమెని లైంగికంగా వేధించేవారని వివరించాడు. ఈ ఆరోపణల నేపధ్యంలో తాము నాలుగు సంవత్సరాల క్రితం రైతులు వారని మట్టుపెట్టి మట్టిలో కలిపెసామని సౌదీ అరేబియా కోర్టుకు వివరించాడు. ఒకానొక దినపత్రిక తెలిపిన సమాచారం ప్రకారం 5 గురు భారతీయ వ్యవసాయ కార్మికులను చంపే ముందు తాము మద్యం మరియు మాదక ద్రవ్యాలను సేవించామని కేంద్ర క్వాటిప్ ప్రావిన్స్‌లో కోర్టు ఈ ముగ్గురు హంతకులు చెప్పడం గమనార్హమని పేర్కొంది." భారతీయ వ్యవసాయ కార్మికులు 5 గురు స్పృహ కోల్పోయేవరకు దారుణంగా కర్రలతో కొట్టేమని తర్వాత వారిని వ్యవసాయ ఇంటి వెనుక ఒక గోతిని తవ్వి అందులో వారిని సజీవంగా ఖననం చేసేమని తెలిపారు. చేసిన పాపం వెంటాడి తీరుతునదన్నట్లుగా నాలుగేళ్ల తర్వాత ఇటీవల్ అదే ప్రాంతంలో వ్యవసాయ పనులను చేస్తున్న సమయంలో గుంటలు తవ్వుతున్నవారికి మానవ పుర్రె ఎముకలు కనబడటంతో ఈ విషయం వెలుగులోనికి వచ్చి పోలిసుల వరకు హత్యల విషయం చేరింది.
తాజా వార్తలు
- ఇరాన్‌కు కొత్త సుప్రీం లీడర్‌గా మొజ్తబా ఖామెనీ నియామకం
- ఖతార్ పై మిస్సైల్ అటాక్.. అడ్డుకున్న డిఫెన్స్ సిస్టమ్..!!
- బహ్రెయిన్ లో డ్రోన్ దాడి.. పలువురికి గాయాలు..!!
- ధరల పెంపు..449 సంస్థలకు Dh176,000 ఫైన్స్..!!
- డ్రోన్‌ను కూల్చివేసిన కువైట్ నేషనల్ గార్డ్..!!
- డ్రగ్స్ స్మగ్లింగ్ ను అడ్డుకున్న కోస్ట్ గార్డ్..!!
- ఇరాన్ ను హెచ్చరించిన సౌదీ అరేబియా..!!
- యూఏఈలోని భారతీయ స్కూళ్లకు ముందస్తు సెలవులు..!!
- ఘనంగా వంశీ–జమున అంతర్జాతీయ మహిళా పురస్కారాల ప్రదానం
- చరిత్ర సృష్టించిన భారత్.. టీ20 వరల్డ్ కప్ కైవసం









