దుబాయ్ ఎయిర్‌షోలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన తేజస్!
- November 18, 2023
దుబాయ్: దుబాయ్ ఎయిర్‌షో 2023 కోసం ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన తేలికపాటి యుద్ధ విమానం తేజస్ దుబాయ్ లో కనువిందు చేసింది. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారుచేసిన (HAL) ఈ లైట్ కాంపాక్ట్ ఎయిర్‌క్రాఫ్ట్ 2022లో నిర్వహించిన ఎయిర్‌షోలోనూ పాల్గొంది.
ఈ సంవత్సరం కూడా ఇవే ఫైటర్ జెట్‌లు యూఏఈ వెళ్లాయి. అయితే ఈ ఏడాది సరికొత్త హార్డ్‌వేర్ అప్‌గ్రేడ్‌లను కలిగి ఉంది.
తేలికపాటి యుద్ధ విమానం తేజస్‌లో ఇటీవల చేసిన హార్డ్‌వేర్ అప్‌డేట్- లాంగ్ రేంజ్ ప్రెసిషన్ గైడెడ్ మ్యూనిషన్‌ను కలిగి ఉంది. ఈ హార్డ్‌వేర్‌ను యూఏఈలోని అల్ తారిక్ అనే సంస్థ అభివృద్ధి చేసింది. ఫలితంగా తేజస్ పరిధి 45km నుంచి 120km పెంచింది. దీంతో ఈ తరహా యుద్ధ విమానాలు ఎక్కువ లక్ష్యాలను సురక్షితంగా చేరుకొనేలా చేస్తాయి.
తేజస్ ప్రస్తుతం ప్రపంచంలోనే చిన్న మరియు తేలికపాటి సూపర్‌సోనిక్ యుద్ధ విమానంగా ఉంది. భారత ప్రభుత్వానికి చెందిన హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మరియు యూఏఈ ప్రభుత్వానికి చెందిన ఎడ్జ్, దక్షిణాఫ్రికాకు చెందిన డేనిల్ డైనమిక్స్ జాయింట్ వెంచర్‌గా ఉన్న అల్ తారిక్ సంస్థ మధ్య ఈ సంవత్సరం ప్రారంభంలో ఒప్పందం కుదిరింది.
డెనెల్ డైనమిక్స్ ప్రకారం.. అల్ తారిక్ మ్యునిషన్స్ వ్యవస్థ అన్ని వాతావరణ పరిస్థితులు, రాత్రి-పగలు ఆపరేషన్ సామర్థ్యాలను అందిస్తుంది. GPS/INS గైడెన్స్ లేదా ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ లేదా సెమీ ఆటోమేటిక్ లేజర్‌ను కలిగి ఉంటుంది. అటానమస్ టార్గెట్ అక్వైజేషన్‌తోపాటు 100 కి.మీ కంటే ఎక్కువ స్టాండ్ ఆఫ్ పరిధిని కలిగి ఉంటుంది.
అల్ తారిక్ వ్యవస్థ అనేక మిషన్లు మరియు లక్ష్యాల కోసం ఉపయోగించబడుతుంది. సైన్యం సహా ఇతర కీలక దళాలకు వాయుమార్గం ద్వారా సాయం చేసేందుకు మరియు లోతైన యుద్ధభూముల్లో సాయం చేస్తుంది. మరియు లక్షిత దాడులు చేయడం సహా మరియు వంతెనలు, పారిశ్రామిక ప్రాంతాలు, మౌలిక సదుపాయాల లక్ష్యాలపై దాడి చేయవచ్చు.
వాయు స్థావరాలపై దాడులు చేసేందుకు, గగనతలం నుంచి మిసైల్‌ను లాంచ్ చేసేందుకు, రన్‌వేలపై ఉన్న శత్రువుల ఎయిర్‌క్రాఫ్ట్‌ల దాడులకు ఉపయోగపడుతుంది. దుబాయ్ ఎయిర్‌షోలో గత సంవత్సరం పాల్గొన్న తేజస్‌ల కంటే ఈ ఏడాది ఉన్న తేలికపాటి ఫైటర్‌జెట్‌లు మరింత అధునాతనమైనవి, శక్తివంతమైనవి. అయితే కేవలం ఎయిర్‌షో కోసమే తేజస్‌లో అమర్చినట్లు తెలుస్తోంది. అయితే అధికారికంగా మోహరించలేదు.
దుబాయ్ ఎయిర్‌షోలో కోట్ల రూపాయల విలువైన అనేక మల్టీ ఎయిర్‌లైన్ అగ్రిమెంట్స్ కోసం ఒప్పందాలు కుదిరినట్లు తెలుస్తోంది. ఈ కార్యక్రమానికి వచ్చిన వారిని ఆకర్షించేందుకు మరియు ప్రపంచానికి వీటి సత్తా చూపించేందుకు ఈ కార్యక్రమంలో అనేక సాహస కార్యక్రమాలను నిర్వహించారు. భారత వైమానికి దళం ఇందులో పాల్గొంది.
తాజా వార్తలు
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!
- ఖతార్ లో వర్క్ బ్యాన్ తొలగింపు..!!
- ఆన్లైన్ ద్వారా పిల్లలపై లైంగిక వేధింపులు..8మంది అరెస్టు..!!
- ఆషెల్ సాలరీ ట్రాన్స్ ఫర్ పై చర్చించిన PAM, బ్యాంకులు..!!
- అమానా హెల్త్ కేర్ ఫెసిలిటీని సందర్శించిన NHRA చీఫ్..!!
- ఘాలా వేర్ హౌజ్ లో అగ్నిప్రమాదం..!!
- WhatsApp ద్వారా ఆధార్ కార్డు డౌన్లోడ్ చేయడం