పారాసెట్మాల్ ని విరివిగా వాడేస్తే అంతే సంగతి.!
- November 18, 2023ఏ చిన్న నొప్పి వచ్చినా.. లేదంటే కొద్దిగా శరీరం వేడెక్కినా (టెంపరేచర్) ఓ పారాసెటమాల్ టాబ్లెబ్ వేసుకోవడం చాలా మందికి అలవాటు. దీని కోసం డాక్టర్ ప్రిస్కిప్షన్తో పని కూడా వుండదు.
కానీ, పారాసెటమాల్ని ఎక్కువగా వాడితే చాలా రకాల దుష్ప్రభావాలు ఎదుర్కోవాల్సి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. పారాసెటమాల్ని అధిక మోతాదులో తీసుకోవడం వల్ల ఎర్ర రక్తకణాల వృద్ధి తగ్గిపోయి, రక్త హీనత ఏర్పడుతుంది.
తద్వారా వీపరీతమైన నీరసం, అలసట వస్తాయ్. అలాగే అలర్జీ వున్నవారు పారాసెటమాల్ని వైద్యుని సలహా లేకుండా తీసుకుంటే, ఆ సమస్య మరింత తీవ్రతరమై ప్రాణాపాయం కూడా సంభవించొచ్చట.
నెలసరి సమయంలో కొంతమందిలో వచ్చే నొప్పిని తట్టుకోవడానికి పారాసెటమాల్ వాడుతుంటారు. కానీ ఆ టైమ్లో అస్సలు పారాసెటమాల్ తీసుకోరాదని చెబుతున్నారు.
అధిక రక్తప్రావం, కళ్లు తిరిగి పడిపోవడం.. వంటి సమస్యలు తలెత్తుతాయట. అలాగే గర్భిణీ స్ర్తీలు, పాలిచ్చే తల్లలు కూడా పారాసెటమాల్ని విరివిగా వాడరాదని చెబుతున్నారు.
తాజా వార్తలు
- ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై నీతి ఆయోగ్ సంచలన ప్రకటన
- హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో భారీ వర్షం
- CBSE పాఠశాలలు ఓపెన్-బుక్ పరీక్షలను నిర్వహిస్తాయా?
- స్లోవాక్ ప్రధానిపై హత్యాయత్నం.. తీవ్రంగా ఖండించిన ఖతార్
- వీసా కోసం లంచం...ఉద్యోగికి 4 ఏళ్ల జైలుశిక్ష
- గాజా భవిష్యత్తు. నెతన్యాహుపై క్యాబినెట్ అసంతృప్తి..!
- ఒమన్ ఎయిర్ వింటర్ షెడ్యూల్ పొడిగింపు
- ఏపీలో సంక్షేమ పథకాల అమలుకు నిధులు విడుదల
- ఉద్యోగులకు ఎమిరేట్స్ బోనస్. ప్రైవేట్ కంపెనీలు అనుసరిస్తాయా?
- ఏపీ ఎన్నికల ఫలితాలపై రూ.కోట్లలో బెట్టింగ్లు