బాలయ్య సినిమాలో హనీరోజ్.! ఇంకోస్పారి.!
- November 18, 2023
‘వీర సింహారెడ్డి’ సినిమాతో మలయాళ బ్యూటీ హనీ రోజ్ని టాలీవుడ్‌కి తీసుకొచ్చాడు నందమూరి బాలయ్య. ఈ సినిమాలో తన పాత్రకు గాను మంచి మార్కులేయించుకుంది హనీ రోజ్.
ఈ సినిమాతో వచ్చిన ఫేమ్‌తో ఇంకేముంది.! హనీ రోజ్ తెలుగులో తెగ బిజీ అయిపోతుందనుకున్నారంతా. కానీ అలా జరగలేదు. ఆమె ఖాతాలో మళ్లీ ఇంకో సినిమా పడిందే లేదు.
తాజాగా బాలయ్య సినిమాలోనే మరో ఛాన్స్ అందుకున్నట్లు తెలుస్తోంది. బాలయ్య, బాబీ కాంబినేషన్లో సినిమా రీసెంట్గా స్టార్ట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ ఇంకా కన్ఫామ్ కాలేదు కానీ, హనీరోజ్‌కి మాత్రం ఓ ఇంపార్టెంట్ రోల్ కన్పామ్ అయ్యిందట.
సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో ప్రతిష్టాత్మకంగా ఈ సినిమా రూపొందుతోంది. అన్నట్లు ఈ సినిమాలో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.
‘సీతారామం’ సినిమాతో తెలుగులో మంచి పేరు తెచ్చుకున్నాడు దుల్కర్. తెలుగు ప్రేక్షకుల మనసులో ప్రత్యేకమైన స్థానం కూడా సంపాదించుకున్నాడు. మరి, ఈ సినిమాలో ఆయన కోసం ఏ స్పెషల్ రోల్ క్రియేట్ చేశాడో డైరెక్టర్ బాబీ చూడాలిక.
తాజా వార్తలు
- బహ్రెయిన్‌లో అద్దెదారులకు ఊరట..?
- ఒమన్‌లో ప్రవాస మహిళలు అరెస్ట్..!!
- సౌదీలో నాలుగు ప్రాంతాలకు రెడ్ అలెర్ట్ జారీ..!!
- ప్రాంతీయ భద్రతను మరింత బలోపేతం చేయాలి..!!
- అబుదాబిలో 9,237 ఈ-స్కూటర్లు సీజ్..!!
- కువైట్‌లో 6 పోలీస్ స్టేషన్లు తాత్కాలికంగా మూసివేత..!
- కువైట్ విదేశాంగ మంత్రితో షేక్ అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్లో చర్చలు
- తలారి ముత్తన్న కుటుంబానికి తెలంగాణ గల్ఫ్ సమితి ఆర్థిక భరోసా
- లోక్ భవన్లో గవర్నర్ ఆయుధ పూజలు
- జనవరి దర్శన టికెట్ల విడుదల తేదీలు ఇవే.. పూర్తి షెడ్యూల్







