‘ధృవనక్షత్రం’ ఈ సారైనా మెరిసేనా.?
- November 18, 2023
మరుగున పడిపోయిన సినిమా ‘ధృవనక్షత్రం’. విక్రమ్, రీతూవర్మ జంటగా ఎప్పుడో రిలీజ్ కావల్సిన సినిమా ఇది. విలక్షణ దర్శకుడు గౌతమ్ మీనన్ ఈ సినిమాని తెరకెక్కించారు. అయితే, కొన్ని ఆర్ధిక లావాదేవీల కారణంగా ఈ సినిమాని అనుకున్న టైమ్‌కి ఆయన రిలీజ్ చేయలేకపోయారు.
రీసెంట్‌గా ఆ సినిమాని బూజు దులిపి రిలీజ్ డేట్ ప్రకటించడంతో అందరి దృష్టీ ఆ సినిమాపై పడింది. ఈ నెల 24న ‘ధృవనక్షత్రం’ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో సినిమాకి సంబంధించిన ప్రమోషన్లు మొదలు పెట్టారు. గౌతమ్ మీనన్ వంటి సీనియర్ దర్శకుడు తన సినిమాని ఎందుకు రిలీజ్ చేసుకోలేకపోయాడు.? అది కూడా విక్రమ్ వంటి సీనియర్ హీరోతో తీసిన సినిమా... ఇలా పలురకాల అనుమానాలతో కూడిన ప్రశ్నలు ఈ ప్రమోషన్లలో గౌతమ్ మీనన్ ఎదుటకు వస్తున్నాయ్.
వాటన్నింటినీ చాకచక్యంగా ఎదుర్కొంటూ.. ఫైనాన్షియల్ ట్రబుల్స్ వల్ల అనుకున్న టైమ్‌కి ఇవ్వాల్సిన వాళ్లకి డబ్బులు చెల్లించకపోవడం, వాళ్లు సినిమాపై కేసులు పెట్టడం.. తదితర కారణాల వల్ల ఈ సినిమా రిలీజ్ లేట్ అయ్యిందని ఆయన ఓపెన్ చెప్పుకొచ్చారు.
ఏది ఏమైనా విక్రమ్ అండ్ గౌతమ్ మీనన్ కాంబో మూవీ అంటే ఖచ్చితంగా ఆ సినిమాపై అంచనాలుంటాయ్. సినిమా పాతదైపోయినా.. గౌతమ్ మీనన్ ఫ్లేవర్ ఏదో మ్యాజిక్ చేస్తుందని ఆడియన్స్ ఎదురు చూస్తున్నారు. మరి గౌతమ్ మీనన్ ఆ అంచనాల్ని నిలబెట్టుకుంటాడో లేదో తెలియాలంటే ఈ నెల 24 వరకూ వెయిట్ చేయాల్సిందే.
తాజా వార్తలు
- మస్కట్‌లో పార్కింగ్ సర్వే ప్రారంభం..!!
- త్వరలో ఆటోమేటిక్ వెహికల్ ఇన్ ఫెక్షన్ సెంటర్ ప్రారంభం..!!
- జిసిసి ప్రతినిధులతో అమీర్ సమావేశం..!!
- ‘శ్రావణం’ ఓనం ఉత్సవంలో గ్రాండ్ కాన్సర్ట్..!!
- కొత్త చట్టం.. గరిష్టంగా SR20,000 జరిమానా..!!
- యూఏఈ ప్రవాసిని వరించిన Dh1 మిలియన్ లాటరీ..!!
- ఫోన్‌పే చేసేవారికి బిగ్ అలర్ట్..
- శ్రీవారిని దర్శించుకున్న మారిషస్ దేశ ప్రధాని
- కరీంనగర్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి నూతన రూపం
- భద్రతా సహకారంపై సౌదీ, కువైట్ చర్చలు..!!