1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ

- November 19, 2023 , by Maagulf
1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స.. యూఏఈ

యూఏఈ: 1,000 మంది పాలస్తీనియన్ క్యాన్సర్ రోగులకు చికిత్స అందించేందుకు యూఏఈ ముందుకొచ్చింది. ఈ మేరకు వారికి చికిత్స చేసేందుకు ఏర్పాట్లు చేయాలని యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ అధికారులను ఆదేశించారు. యుద్ధం-దెబ్బతిన్న గాజా స్ట్రిప్ నుండి అన్ని వయసుల క్యాన్సర్ రోగులకు ఇది వర్తిస్తుందన్నారు.  ఇదిలా ఉండగా.. శనివారం తెల్లవారుజామున గాజా నుండి పిల్లలు, మహిళలతో కూడిన విమానం అబుదాబికి చేరుకున్నది.  గాజాకు సహాయక చర్యలను యూఏఈ నిర్వహిస్తోంది. ఇందుకోసం  Gallant Knight 3 కార్యకలాపాలను ప్రారంభించింది. గాజా స్ట్రిప్‌లో ఒక ఫీల్డ్ హాస్పిటల్‌ను నిర్మిస్తోంది. అలాగే పాలస్తీనియన్ల నీటి సరఫరా కోసం మూడు డీశాలినేషన్ ప్లాంట్‌లను నిర్మిస్తోంది యూఏఈ.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com