ప్రపంచ కప్ ఫైనల్లో ఓడిన భారత్...
- November 19, 2023
అహ్మదాబాద్: స్వదేశంలో ప్రపంచ కప్‌ను సగర్వంగా ఎత్తుకోవాలన్న టీమిండియా ఆశలు అడియాశలయ్యాయి. తనకు తిరుగులేదని ఆస్ట్రేలియా మరోసారి నిరూపించింది. విశ్వవిజేతగా నిలిచింది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్‌తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 241 పరుగుల లక్ష్యాన్ని 43 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఆసీస్ బ్యాటర్లలో ట్రావిస్ హెడ్ (137; 120 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లు) సెంచరీతో చెలరేగాడు. డేవిడ్ వార్నర్ (7), మిచెల్ మార్ష్ (15), స్టీవ్ స్మిత్ (4)లు విఫలమైన లబుషేన్ (58 నాటౌట్; 110 బంతుల్లో 4 ఫోర్లు) హాప్ సెంచరీతో రాణించాడు. భారత బౌలర్లలో బుమ్రా రెండు వికెట్లు తీశాడు. మహ్మద్ షమీ, సిరాజ్ లు చెరో వికెట్ పడగొట్టారు.
అంతక ముందు మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 240 పరుగులకు ఆలౌలైంది. టీమ్ఇండియా బ్యాటర్లలో విరాట్ కోహ్లీ (54; 63 బంతుల్లో 4 ఫోర్లు), కేఎల్ రాహుల్ (66; 107 బంతుల్లో 1 ఫోర్) లు అర్ధశతకాలు చేశారు. కెప్టెన్ రోహిత్ శర్మ (47; 31 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) వేగంగా ఆడాడు. ఆస్ట్రేలియా బౌలర్లలో మిచెల్ స్టార్క్ మూడు వికెట్లు తీశాడు. జోష్ హేజిల్‌వుడ్, పాట్ కమిన్స్ చెరో రెండు వికెట్లు తీశారు. మాక్స్వెల్, జంపాలు తలా ఓ వికెట్ పడగొట్టారు.
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు శుభారంభం దక్కలేదు. శుభ్‌మన్ గిల్ (4) తక్కువ స్కోరుకే ఔటైనప్పటికీ కెప్టెన్ రోహిత్ శర్మ దూకుడుగా ఆడడంతో భారత్ 9 ఓవర్లలో 70 పరుగులు చేసింది. భారీ స్కోరు ఖాయమైన భావిస్తున్న తరుణంలో ఆస్ట్రేలియా బౌలర్లు విజృంభించారు. స్వల్ప వ్యవధిలో రోహిత్ శర్మ పాటు శ్రేయస్ అయ్యర్ (4) ఔట్ చేశారు. విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ లు వికెట్ కాపాడుకోవడానికే ప్రాధాన్యం ఇవ్వడంతో పరుగుల వేగం మందగించింది.
56 బంతుల్లో విరాట్ కోహ్లీ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరికాసేపటికే కమిన్స్ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్ అయ్యాడు. దీంతో 67 పరుగుల నాలుగో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది. బ్యాటింగ్ ప్రమోషన్ పొందిన రవీంద్ర జడేజా (9)తో పాటు కేఎల్ రాహుల్ లను స్టార్క్‌కు స్వల్ప వ్యవధిలో ఔట్ చేశాడు. షమీ (6), బుమ్రా (1), సూర్యకుమార్ యాదవ్ (18) లు తక్కువ పరుగులకే పెవిలియన్‌కు చేరడంతో భారత్ ఓ మోస్తరు స్కోరుకే పరిమితమైంది.
తాజా వార్తలు
- సౌదీ అరేబియాలో నాలుగేళ్లలో వచ్చే బ్యాంకు సెలవులు..!!
- డ్యూటీ ఫ్రీ డ్రా.. $1 మిలియన్ గెలుచుకున్న కేరళ వాసి..!!
- యూనివర్శిటీ స్ట్రీట్‌లో రోడ్డు మూసివేత: అష్ఘల్
- కువైట్ లో భారత రాయబారి పనితీరుపై ప్రశంసలు..!!
- AI లో ఇండియా-బహ్రెయిన్ మధ్య సహకారం..!!
- మాదకద్రవ్యాల వాడకాన్ని తగ్గించేందుకు 'హయా' ప్లాట్‌ఫామ్..!!
- టెర్మినల్–1 ఫ్లైట్ రెస్టారెంట్–విమానం ఎక్కిన ఫీలింగ్‌తో భోజనం
- బ్రహ్మోత్సవాల్లో ఇస్రో సేవలు తొలిసారి శాటిలైట్ ఆధారంగా భక్తుల గణన: బిఆర్ నాయుడు
- పాకిస్తాన్ సంచలన నిర్ణయం..
- జెనీవాలో దోహాపై ఇజ్రాయెల్ దాడిని ఖండించిన 78 దేశాలు..!!